చంద్రబాబు మాటలు ఎలా ఉంటాయంటే తాను చెప్పే నీతులు ఎదుటివారికేనన్నట్లుగా ఉంటాయి. ఆయన మాత్రం వాటిని ఆచరణలో పెట్టరంటే పెట్టరు. ఇక జగన్ని ఆయన అయిదేళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎన్ని రకాలుగా అవమానించారో అందరూ చూశారు. ఇపుడు బాబు గారు ప్రతిపక్షంలోకి వచ్చారు. కానీ వైఖరి మారలేదు.


జగన్ని ఆయన సీఎం హోదాలో చూడలేకపోతున్నారు. ఆ మాట కంటే అసలు జగన్ని ఆయన రాజకీయంగా మనుగడలో ఉండడాన్ని కూడా కూడా సహించలేకపోతున్నారనుకోవాలి. జగన్ జనంలో సీఎం కాలేడన్న బాబు దురంకారమే జగన్ని సీఎం ని చేసింది. నాకు ఎదురు లేదనుకున్న బాబు అలవి కానీ అధికార విలాసాలే ఈ స్థితికి తెచ్చాయి. ప్రజాస్వామ్యం గురించి గొప్పలు చెప్పే చంద్రబాబు జగన్ని ప్రజలు ఎన్నుకున్నారని, దాన్ని గౌరవించాలని మరచిపోతున్నారు.


నా అనుభవం కంటే నీ వయసు చాలా చిన్నది అంటూ బాబు ఎగతాళి   చేస్తున్నారు. అసలు బాబు సీఎం అయ్యేనటికి ఆయన వయసు కూడా జగన్ వయసే. నాడు ఎవరైనా బాబు వయసును ఎత్తి చూపారా. అసలు ఈ దేశంలో ముసలివాళ్ళు, పెద్ద వాళ్ళు అధికారం చూరు పట్టుకుని వేలాడడం అలవాటు అయింది కానీ ఇతర దేశంలో యంగర్ జనరేషన్లకే ఉన్నత పదవులు దక్కుతున్నాయి. బాబు తరం అంతరాలను గుర్తించకపోతే ముందుకు అడుగులు ఎలా వేస్తారు.


ఇదిలా ఉండగా  ‘నా అనుభవం అంతలేదు మీ వయసు’ అని సీఎంను ఉద్దేశించి అనడాన్ని మంత్రి  బొత్స తప్పుపట్టారు. సభలో గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలన్నారు. సభా నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ప్రజలు అవకాశం ఇవ్వబట్టే జగన్‌ సీఎం అయ్యారని చెప్పారు.టీడీపీ సభ్యులు సంయమనం పాటించాలని, సభా సంప్రదాయాలను ఉల్లంఘించే వారిపట్ల స్పీకర్‌ కఠినంగా వ్యవహరించాలని కోరారు


మరింత సమాచారం తెలుసుకోండి: