ఎపి శాసన సభ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి.  ఎప్పుడు లేనంతగా హాట్ హాట్ టాపిక్ లతో  హాట్ హాట్ గా సాగుతున్నాయి.  ఎవరికీ వారు  రెచ్చిపోయి మాట్లాడుతున్నారు.  వడ్డీ లేని ఋణం విషయంలో చర్చ జరుగుతున్నది. ఈ చర్చ జరిగే సమయంలో జగన్ రెచ్చిపోయి మాట్లాడారు. 

సున్నాలేని వడ్డీలపై గతంలో తమ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఇచ్చిందని బాబు వివరించారు.  దీనిపై అధికార పక్షం సమాధానం ఇచ్చింది. గోరంత ఇచ్చి కొండంత ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు.  దీంతో ప్రతిపక్షం లేని రగడ చేయడంతో ముఖ్యమంత్రి జగన్ ఘాటుగా స్పందించాడు.  


సభలో తమ బలం 150 మంది ఉన్నారని, తాము తలుచుకుంటే ప్రతిపక్షం సీట్లో కూర్చోలేదని, శరీరాలు పెరగడం కాదు బుద్ధి పెరగాలని జగన్ అనడంతో సభలో గందరగోళం మొదలైంది.  సభలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య గొడవ జరిగింది.  


ఈ గొడవతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. ఈరోజు అందరి దృష్టి బడ్జెట్ పై ఉంటె.. ఆ విషయాలు మాట్లాడకుండా ఇలా వేరే వేరే విషయాలపైనా మాట్లాడుతుండటంతో టీవీల ముందు కూర్చున్న ప్రజలు ఏం జరుగుతున్నదో అర్ధంగాక షాక్ అయ్యారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: