ఏపీ అసెంబ్లీ రెండో రోజు అధికార- విపక్షాల మధ్య యుద్ధం మరింతగా ముదిరింది. ముఖ్యమంత్రి జగన్.. తెలుగుదేశం నేతల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఐదేళ్లలో సున్నావడ్డీ పథకానికి రూ.11,595 కోట్లు ఇవ్వాల్సిఉంటే రూ.630 కోట్లు మాత్రమే చెల్లిందన్నారు. సున్నా వడ్డీ పథకం గొప్పగా అమలు చేసినట్లుగా..జాతీయ స్థాయిలో కూడా ఆయనను పొడిగినట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.


ఈ సమయంలో తెలుగుదేశంనేతలు సీఎం ప్రసంగానికి అడ్డుతగలడంతో జగన్ ఆగ్రహంతో ఊగిపోయారు. ముఖ్యమంత్రిని మాట్లాడుతుంటే.. ఊరికే అడ్డుపడతారా.. అంటూ మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్ల్లో ఒక్కరికి కూడా సంస్కారం లేదా అని ప్రశ్నించారు.


ఈ సమయంలో జగన్ ఆగ్రహంతో ఊగిపోయారు. అచ్చెన్నాయుడు వంటి నేతలకు సైజు పెరిగింది కానీ.. బుర్ర పెరగలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడిని కూర్చో.. కూర్చో.. కూర్చో అంటూ పలుసార్లు ఆగ్రహంగా జగన్ హెచ్చరించారు. మా వాళ్లు 150 మంది ఉండారు.. వాళ్లు ఒక్కసారి లేస్తే.. మీ వాళ్లు ఎవరూ స్థానాల్లో కూర్చోలేరని అన్నారు.


ఏంమాట్లాడుతున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యేలపై జగన్ నిప్పులు చెరిగారు. జగన్ ఆగ్రహంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చంద్రబాబు మాట్లాడుతున్నప్పుడు తాము మాట్లాడలేదని... కానీ తాను మాట్లాడుతుంటే టీడీపీ నేతలు సిగ్గు, సంస్కారం లేకుండా లేచి అడ్డుపడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: