నేరం చేసిన వారు ఎవరైనా..ఎంతటి వారైనా చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఎన్నో సార్లు నిరూపించబడింది. ఇది సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నాయకులైనా సరే తప్పు చేస్తే శిక్ష తప్పదన్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ చానెల్ మోజో టీవీ మాజీ సీఈఓ రేవతిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

గతంలో ఆమె పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కాగా, విచారణ నిమిత్తం ఆమెను అదుపులోకి తీసుకున్నామని బంజారాహిల్స్‌ పోలీసు అధికారులు స్పష్టం చేశారు. మోజీ టీవీ స్టూడియోలో  తనను అవమానించారని దళిత నేత హమారా ప్రసాద్ పెట్టిన కేసులో రేవతి ఏ2 గా ఉన్నారు. కాగా, ఈ  కేసు విషయమై తాము ఇచ్చిన నోటీసులకు రేవతి స్పందించలేదని  పోలీసులు చెబుతున్నారు. దీంతో శుక్రవారం ఉదయం ఆమెను బంజారాహిల్స్ పోలీసులు మోజో  టీవీ మాజీ సీఈఓ రేవతిని శుక్రవారం నాడు బంజరాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

మరోవైపు ఎలాంటి వారంట్, నోటీసులు లేకుండానే తనను పోలీస్ స్టేషన్ కు రావాలని పోలీసులు చెబుతున్నారని ఆమె ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.ప్రస్తుతం ఆమెపై వచ్చిన ఆరోపణలపై అధికారులు విచారిస్తున్నట్టు సమాచారం. రేవతి అరెస్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: