చంద్రబాబు కలల రాజధాని అమరావతి,  సీఎం గా ఉండగా తెల్లారిలేస్తే ఆయన ఆ పదం ఎన్ని సార్లు వల్లించేవారో గుర్తే లేదు. అయితే అంతగా వల్లించిన చంద్రబాబు అమరావతిని భ్రమల్లోనే ఉంచారు తప్ప రియాలిటీకి తేలేకపోయారు. తానూ తన కుటుంబం 2050 వరకూ  పవర్లో ఉంటుంద‌ని, ఈ లోగా నెమ్మదిగా రాజధాని పని కానిచ్చుకోవచ్చునని బాబు భావించారు. కానీ కధ అక్కడే మలుపు తిరిగింది.


బంపర్ మెజార్టీతో జగన్ అధికారంలోకి వచ్చారు. విపక్ష నేతగా ఉండగా, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా జగన్ అమరావతి గురించి ఒక్క మాటైనా చెప్పలేదు. ఇక  జగన్ తొలి బడ్జెట్ ఇవాళ ప్రవేశపెట్టారు. అందులోనైనా అమరావతి సందేహాలు తీరుతాయని అనుకున్న వారికి ఒక విషయంలో మాత్రం క్లారిటీ వచ్చింది.


అమరావతి జగన్ తొలి ప్రాధాన్యత కాదు అని, తొలి కాదు, కనీసం వన్  టు  టెన్ లోనైనా లేదని కూడా బాగా అర్ధమైంది. అమరావతికి  బడ్జెట్లో జగన్ సర్కార్ కేటాయించింది అక్షరాలా 500 కోట్లు మాత్రమే. దాంతో అమరావతి ముందుకూ కదలదు, వెనక్కీ పోదు. మరి అలాంటి అమరావతి రాజధాని విషయంలో జగన్ లెక్కలు వేరే ఉన్నాయా. అంటే అవుననే సమాధానం వస్తోంది చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: