వ్యవసాయం దండుగ‌ అన్న వారిని అధికారంలో నుంచి దించేసి పండుగ అన్న వారికి పట్టం కట్టిన రోజులవి. వైఎస్సార్ సీఎం గా ఉన్నపుడు రైతుల కోసం ఎంతో చేశారు. ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. మనసుంటే మార్గం ఉంటుందని, మనీ కూడా బడ్జెట్లోకి అదే పరుగులు తీసుకుంటూ వస్తుందని వైఎస్సార్ నమ్మారు. అలాగే ఆయన హయాంలో వ్యవసాయం పండుగే అయింది.


ఇపుడు ఆయన బాటలో నడిచే ఆయన తనయుడు జగన్ కూడా రైతుల పక్షపతిగా పేరు తెచ్చుకున్నారు. బడ్జెట్లో రైతుల కోసం ఎన్నో పధకాలు ప్రవేశపెట్టారు. ఇక వ్యవ‌సాయ బడ్జెట్లో ఏకంగా 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.28,866.23 కోట్లను కేటాయించారు. ఈ బడ్జెట్ ని  రాష్ట్ర  వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ  ఈ రోజు శాసన సభలో ప్రవేశపెట్టారు.


సోదరుడి ఆకస్మిక మరణం కారణంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు శాసనసభకు అసెంబ్లీకి రాలేకపోయారు. దీంతో ఆయన బదులు వ్యవసాయ బడ్జెట్‌ను బొత్స ప్రవేశపెట్టారు. రూ.28,866.23 కోట్ల వ్యవసాయ బడ్జెట్లో.. రెవిన్యూ వ్యయం రూ. 27,946.65 కోట్లు కాగా పెట్టుబడి వ్యయం రూ. 919.58 కోట్లు. రైతు పెట్టుబడి సాయం కింద రూ.8750 కోట్లు కేటాయించారు. రైతు భరోసా కింద ఒక్కో రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 సాయం చేయనున్నారు. 


కౌలు రైతుల సంక్షేమం కోసం పట్టాదారుకు ఇబ్బంది లేకుండా 11 నెలలకు కౌలు పత్రం ఇస్తామన్నారు. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కోసం రూ.1163 కోట్లు, వడ్డీ లేని రుణాల కోసం రూ.100 కోట్లు, వైఎస్సార్ రైతు బీమా కోసం రూ. 100 కోట్లు కేటాయించారు. . తుంపర, బిందు సేద్యం పథకాల కోసం రూ.1105.66 కోట్లు కేటాయించారు.


 పాడి రైతుకు లీటర్‌కు రూ.4 చొప్పున బోనస్ ఇస్తామన్నారు. కౌలు రైతులకు రూ.1200 కోట్లు, రైతులకు సహకార సంఘాల దీర్ఘాకాలిక రుణాల కింద రూ.1500 కోట్లు కేటాయించారు. మొత్తానికి చూసుకుంటే నాడు వైఎస్సార్, నేడు జగన్ ఇద్దరూ కూడా రైతే రాజు అని ఘనంగా చాటారు. ఇంతలా బడ్జెట్లో రైతులకు భారీ కేటాయింపులు జరిపిన సర్కార్ వేరొకటి లేదని కూడా చాటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: