కర్ణాటక రాజకీయాల్లో మరో సంచలనం ఆవిష్కృతమైంది. ఇప్పటికే కుమార స్వామి సర్కారును గద్దె దింపేందుకు విపక్షం బీజేపీ అనేక ఎత్తులు వేస్తుంటే.. సీఎం ఇప్పుడు మరో షాక్ ఇచ్చారు. ఎవరో తన సర్కారును దింపేందేంటి అనుకున్నారో ఏమో కానీ..అనూహ్యంగా తానే బలపరీక్షకు సిద్ధమని ప్రకటించారు.


ఇప్పటికే మైనారిటీ సర్కారుగా కొనసాగుతున్న కుమార స్వామి ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి స్టెప్ వేయడం వెనుక రాజకీయం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. తాను బలపరీక్షకు సిద్దంగా ఉన్నానని సీఎం కుమారస్వామి అసెంబ్లీలోనే ప్రకటించారు.


శుక్రవారం అసెంబ్లీ మొద‌లైన త‌ర్వాత‌..బలపరీక్షకు సమయం ఖరారు చేయాలని స్పీకర్‌ కేఆర్ రమేశ్‌ కుమార్‌ను సీఎం కుమార స్వామి కోరారు. ఆయన ఏమన్నారంటే...

" కొంద‌రు ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయాల వ‌ల్ల రాష్ట్ర రాజ‌కీయాలు అనేక మ‌లుపులు తిరుగుతున్నాయి. రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో నేను అధికారంలో ఉండలేను. అయితే నాకు ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దాన్ని రుజువు చేసుకుంటా. బలపరీక్షకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నా. ఇందుకు సమయాన్ని ఖరారు చేయండి" అంటూ సీఎం కుమారస్వామి కోరారు.


కుమార స్వామి స్టెప్ తో కర్ణాటక సంక్షోభం కీలక మలుపు తిరిగింది. ఇప్పుడు బలపరీక్షలో ఏం జరగనుందో... అన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తం 224 మంది ఎమ్మెల్యేలున్న కర్ణాటకలో బీజేపీ బలం 107. సంకీర్ణం సంఖ్యా బలం 100.. మరి కుమార స్వామి సర్కారు భవితవ్యం ఏంటో..?


మరింత సమాచారం తెలుసుకోండి: