చంద్రబాబు, కేసీఆర్ రూటులోనే జగన్ కూడా అడుగులు వేస్తున్నారు. ఏ విషయంలో అంటారా.. ప్రభుత్వ పథకాలకు తమ పేర్లు పెట్టుకోవడంలో ఏపీ సీఎం జగన్.. తనకంటే ముందు ముఖ్యమంత్రులైన చంద్రబాబు, కేసీఆర్ రూటులోనే వెళ్తున్నారు.


గతంలో చంద్రబాబు సర్కారు హాయంలో అనేక పథకాలకు ఎన్టీఆర్ పేరుతో పాటు చంద్రబాబు పేరు కూడా పెట్టుకున్నారు. చంద్రన్న భీమా, చంద్రన్న కానుక.. ఇలా అనేక పేర్లు పెట్టుకున్నారు చంద్రబాబు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఒకటి, రెండు పథకాలకు తన పేరు పెట్టుకున్నారు. కేసీఆర్ కిట్ అందులో ఒకటి.


వీరిద్దరి తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ కూడా ఇప్పుడు ఓ పథకానికి తన పేరు పెట్టుకున్నారు. ఇకపై జగనన్న విద్యా దీవెనతో విద్యార్ధులకు ఫీ రియింబర్స్ మెంట్ ఇవ్వనున్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని అన్ని కమ్యూనిటీల విద్యార్ధులకు నూటికి నూరు శాతం ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ను ప్రభుత్వం సమకూరుస్తుంది.


ఈ పథకం కింద విద్యార్దులకు అవసరమైన పుస్తకాలు, ఆహారం, ప్రయాణం, హస్టల్ నిర్వహణ కోసం ఒక్కో విద్యార్ధికి ఏడాదికి 20 వేల రూపాయలను కూడా ప్రభుత్వం అందచేస్తుంది. ఇందుకోసం బడ్జెట్ లో 4 వేల 962 కోట్ల రూపాయలు కేటాయించారు. దీని వల్ల రాష్ట్రంలో 15.5 లక్షల మంది విద్యార్ధులకు మేలు చేకూరుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: