చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత అన్నది రాజకీయాల్లో కరెక్టుగా సరిపోతుంది. ఒకప్పుడు తాము చేసిన త‌ప్పులే రాజకీయ నాయకులను ప్రస్తుతం వెంటాడుతుంటాయి. అందుకే ఒకప్పుడు ఎంతో వెలుగు వెలిగిన నేతలంతా ఇప్పుడు డు పిల్లిలా మారిపోతుంటారు. ప్రస్తుతం వైసిపి కి చెందిన ఓ సీనియర్ నేత పరిస్థితి కూడా ఇలాగే అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా మారిపోయింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి  ధర్మాన ప్రసాదరావు ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి - రోశ‌య్య - కిరణ్‌కుమార్రెడ్డి కేబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు.


పదేళ్ల పాటు శ్రీకాకుళం జిల్లాలో ఆయ‌న హ‌వా నడిచింది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను తన‌క‌ను సైగలతో శాసించారు. అలాంటి నేతపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడంతో చివర్లో అనూహ్యంగా మంత్రి పదవి నుంచి తప్పించారు. 2014 ఎన్నికలకు ముందే వైసీపీ లోకి వచ్చిన ఆయ‌న ఆ ఎన్నికలలో ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో గెలిచిన జగన్ మాత్రం ఆయనపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన ధర్మాన ఇప్పుడు నామమాత్రమైన ఎమ్మెల్యే పదవి తో తన నియోజకవర్గానికి పూర్తిగా పరిమితమైపోయారు.


గతాన్ని పక్కన పెట్టేస్తే తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ధర్మాన శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ అత్య‌ల్ప మెజార్టీతో ఓడిపోవడానికి తెరవెనుక చక్రం తిప్పార‌న్న నివేదికలు ఇప్పటికే జగన్ దగ్గరకు చేరిపోయాయి. ఈ క్రమంలోనే జగన్ కనీసం ధర్మానకు మంత్రి పదవి ఇవ్వలేదు సరికదా .... ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదట. జిల్లా రాజకీయాల్లో మీకు సంబంధం లేదు కేవలం మీ నియోజకవర్గాన్ని మాత్రమే మీరు చూసుకోండని ఇప్పటికే క్లారిటీ ఇవ్వడంతో జగన్ పై ధ‌ర్మాన తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది.


ఇప్పుడు జిల్లాలో ధర్మాన సోదరుడు నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ హ‌వా నడుస్తోంది. అలాగే ఆముదాలవలస నుంచి గెలిచిన మరో సీనియర్ నేత స్పీకర్ త‌మ్మినేని సీతారాం కూడా జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు కీలకంగా మారారు. ఇదే టైంలో ధ‌ర్మాన బీజేపీలోకి వెళ్లే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: