అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ సర్కారు తొలి బడ్జెట్ ప్రవేశపెట్టింది. రైతులకు, సంక్షేమానికి పెద్ద పీట వేసింది. సంక్షేమపథకాల్లో భాగాంగా బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ. 100 కోట్లు కేటాయించింది జగన్ సర్కారు.


అయితే దీన్ని టీడీపీ బ్రాహ్మణ నాయకుడు..గతంలో బ్రాహ్మణ సంక్షేమ సంస్థఛైర్మగా వ్యవహరించిన వేమూరి ఆనంద్ సూర్య తప్పుబడుతున్నారు. బ్రాహ్మణ సంక్షేమానికి ఈ బడ్జెట్ లో మెుండి చేయ్యి చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందంటూ విమర్శిస్తున్నారు.


బ్రాహ్మణులకు 1000 కోట్లు కేటాయింపులు జరుగుతాయని ఊదర గొట్టిన 'వైయస్ఆర్, జగన్ పార్టీ నాయకులు, బ్రాహ్మణులకు ఏం సమాధానం చెబుతారు ? అని ప్రశ్నిస్తున్నారు.

ఆయన ఇంకా ఏమని విమర్శిస్తున్నారంటే....

" గౌరవ ఉప సభాపతి గార్ని, ఈ మధ్య కాలంలో బ్రాహ్మణ సంఘాలు సన్మానించినపుడు, వారిచ్చిన హామీ 1000 కోట్లు కేటాయింపులు జరుగుతాయనేది నిజం కాదా? తప్పుడు హామీలు ఇవ్వడం వారిది వారి నాయకులు శ్రీ జగన్ గారి నైజమా? బ్రాహ్మణులకు సమాధానం చెప్పవలసిన భాధ్యత వారిపైనే ఉంది.”


" ఆనాడు మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఓట్ ఆన్ ఎక్కంట్ బడ్జట్ లోనే 100 కోట్లు కేటాయింపు జరిపితే , ఆ వంద కోట్లే మీరు జరిపినట్లు పద్దు రాసుకోవడం మీకే చెల్లింది. ఇది సిగ్గుచేటు కాదా? మీరు నిజంగా మాటమీద నిలబడే వాళ్ళేనా? అయ్ తే నిరుపేద బ్రాహ్మణులకు వారి నిజమైన సంక్షేమానికి 1000 కోట్లు వేంటనే కేటాయింపు జరపాలని డిమాండ్ చేస్తున్నా అంటూ వేమూరి ఆనంద్ సూర్య ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: