ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు నారా లోకేష్ బిగ్ బాస్ లోకి వెళుతున్నారట. తెలుగు స్టార్ మా ఛానల్ లో వచ్చే బిగ్ బాస్ షో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ బిగ్ బాస్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వచ్చిన సమయంలో శివ బాలాజీ విన్ అయ్యారు. 


బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన సమయంలో కౌశల్ విన్ అయ్యారు. అయితే ఈసారి హోస్ట్ గా బుల్లితెరకు ఇప్పటికే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రాంతో పరిచయమున్న నాగార్జున బిగ్ బాస్ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రేమోలు ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను ఆకట్టున్నాయి. నాగార్జున హోస్ట్ గా రావడంతో బిగ్ బాస్ పై మరిన్ని అంచనాలు పెంచుకున్నారు బిగ్ బాస్ అభిమానులు. 


ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ 3 కంటెస్టెంట్లు విల్లే అని వార్తలు కూడా భారీగా వచ్చాయి. శ్రీ ముఖి, శ్రీ రెడ్డి, వరుణ్ సందేశ్, అతని భార్య, జాకీ అందరూ బిగ్ బాస్ లో కంటస్టెంట్లని వార్తలు వచ్చాయి. అయితే బిగ్ బాస్ 3 కంటస్టెంట్ గా నారా లోకేష్ కూడా బిగ్ బాస్ లోకి రానున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందులో ఒక నెటిజన్ నారా లోకేష్ బిగ్ బాస్ లో కి వెళ్లే దానిపై స్పందిస్తూ '' బిగ్ బాస్ లోకి నారా లోకేష్ వెళ్తే నోరు జారుడు, విమర్శలు చెయ్యడం తప్ప ఇంకా ఏమి ఉండదు'' అని వ్యాఖ్య చేసారు. 


ఏది ఏమైనా అప్పటికి నారా లోకేష్ బిగ్ బాస్ లోకి వెళ్తే సూపర్ ఉంటది అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తే, మరికొందరు వైఎస్ జగన్ ని ఎవరు విమర్శిస్తారు లోకేష్ బాబు అని కామెంట్ పెడుతున్నారు. కాగా ఒక రాజకీయ నాయకుడు బిగ్ బాస్ లోకి వెళ్తే రోజు అతను ఎం చేస్తున్నాడు, అతను ఎంతటి ఘనుడు అనేది ఆ షో చూపిస్తుంది. బిగ్ బాస్ లోకి రాజకీయ నాయకులూ వెళ్తే పక్క ఆ షో హిట్ అవుతుందని అంటున్నారు కొందరు నెటిజన్లు. మరి లోకేష్ బిగ్ బాస్ కి వెళ్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: