తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి టిడిపి కోలుకోకుండానే ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు బీజేపీ లోకి జంప్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు ఓ ఎమ్మెల్సీ బిజెపిలోకి చేరిపోయారు. ఇక ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు.... నియోజకవర్గ ఇన్చార్జిలు... మాజీ ఎంపీలు ఉన్నారు. టిడిపి నుంచి ఎంత మంది తమ పార్టీలోకి వచ్చినా చేర్చుకుంటాం ? అని చెబుతున్న కాషాయ దళం నేతలు ఐదుగురు నేతల విషయంలో మాత్రం నో చెబుతున్నారట. ఇంతకు టీడీపీకి చెందిన ఏ నేతలను బీజేపీ వాళ్లు వద్దంటున్నారు. అందుకు గల కారణాలను పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెల్లడి అవుతాయి.


తాజా ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు - మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు - మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ - మాజీ ఎంపీలు జెసి దివాకర్ రెడ్డి - రాయపాటి సాంబశివరావు అని తెలుస్తుంది. ఈ నేతలు ఐదుగురు తాజా ఎన్నికల్లో ఓడిపోయినా టిడిపి అధికారంలో ఉండగా తమ సొంత జిల్లాలో.... తమ నియోజక వర్గాల్లో మంచి ప్రభావం చూప‌కలిగిన నేతలు కావడం విశేషం. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఫ్యామిలీ పై ఎలాంటి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందో ఎన్నికల తర్వాత చూస్తూనే ఉన్నాం... ఇప్ప‌డు వాళ్ల‌ను బిజెపిలో చేర్చుకుంటే ఆ అవినీతి మరక మొత్తం బిజెపికే అంటుతుంద‌ని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.


ఇక చింతమనేని ప్రభాకర్ ఎలాంటి వివాస్ప‌ద నేతో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇక మాజీ ఎంలు జేసీ దివాకర్ రెడ్డి - రాయపాటి సాంబశివరావును పార్టీలో చేర్చుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని... ఇలాంటి నేతలను పక్కనపెట్ట‌ట‌మే బెటర్ అని బిజెపి అధిష్టానం భావిస్తోందట. విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ జనాలు ఎప్పుడో మర్చిపోయిన మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు పార్టీలో చేర్చుకున్న బీజేపీ అధిష్టానం.... టిడిపికి చెందిన సీనియర్ నేతలను మంచి మాత్రం పార్టీలో చేర్చుకునేందుకు ఇష్ట పడటం లేదట. అది అస‌లు సంగ‌తి.


మరింత సమాచారం తెలుసుకోండి: