నిన్నటినుండి ఇద్దరు టీడీపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో ట్విట్టర్ వార్ జరుగుతుంది. ఈ ట్విట్టర్ వార్ వలన ఆ ఇద్దరు నేతల కంటే టీడీపీకే ఎక్కువగా నష్టం జరుగుతోంది. ఇద్దరు నేతలు ఒకరినొకరు విమర్శించుకుంటూ తెలుగుదేశం పార్టీ పరువు తీస్తున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ ఉండటంతో తెలుగుదేశం పార్టీ మీద ఆ పార్టీ నాయకుల మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చేస్తున్నారు. ఆ ఇద్దరు నేతలు ఎంపీ కేశినేని మరియు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. 
 
ఎంపీ కేశినేని నాని ట్విట్టర్లో నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు నాలుగు వాక్యాలు రాయలేని వాడు ట్వీట్ చేస్తున్నాడు దౌర్భాగ్యం అంటూ ట్వీట్ చేసాడు. మరో ట్వీట్లో చంద్రబాబును ఉద్దేశించి నేను మీతో కలిసి ఉండాలంటే మీ పెంపుడు కుక్కను అదుపులో పెట్టుకోండి అని ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్లకు సమాధానంగా బుద్దా వెంకన్న తన ట్విట్టర్లో బస్సుల మీద ఫైనాన్స్ తీసుకొని 1997లో సొంతంగా దొంగ రిసిఫ్ట్ లు తయారు చేసుకుని ఫైనాన్స్ వారికి డబ్బులు చెల్లించకుండా నువ్వే దొంగ ముద్ర వేసుకొని కోట్లాది రుపాయలకు ఫైనాన్స్ కంపెనీలకు చీట్ చేసిన నువ్వా మాట్లాడేది అంటూ బుద్దా వెంకన్న ట్వీట్ చేసాడు. 
 
మరో ట్వీట్లో బుద్దా వెంకన్న దళిత నాయకుడు మాజీ స్పీకర్ బాలయోగి ఆస్తులన్నీ కాజేసిన దొంగ ఎవరో దేశం మొత్తానికి తెలుసు. ఒకే నంబర్ పై దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన దొంగ నువ్వే కదా నేను చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి వినే ధైర్యం నీకు ఉందా అని ట్వీట్ చేసాడు. చంద్రబాబు గారి కోసం, పార్టీ కోసం ఈ ట్వీట్ల యుధ్ధం ఆపేస్తున్నానని అన్నాడు. కానీ టీడీపీ పార్టీకి ఇద్దరు నేతల ట్వీట్ల వలన జరగాల్సిన నష్టం జరిగిపోయింది. టీడీపీ పార్టీకి సొంత పార్ఱీలోని నాయకులే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పార్టీకి శత్రువుల్లా నష్టం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: