అవును మీరు చదివింది నిజమే. తనను విమానాశ్రయంలో రిసీవ్ చేసుకునేందుకు రండి బాబు రండి అంటూ తెలుగుదేశంపార్టీ నేతలకు చంద్రబాబునాయుడు ఎస్ఎంఎస్ ల ద్వారా సమాచారం పంపిస్తున్నారు.  తనను రిసీవ్ చేసుకోవటానికి నేతలను విమానాశ్రయాలకు రమ్మంటూ బ్రతిమలాడుకోవాల్సిన పరిస్ధితి దాపురిస్తుందని చంద్రబాబు ఏనాడూ కల కూడా కనుండరు.

 

ఇంతకీ విషయం  ఏమిటంటే మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా  ఓడిపోయిన తర్వాత చంద్రబాబు పరిస్ధితి చాలా దయనీయంగా తయారైంది. ఎవరో కొద్దిమంది నేతలు తప్ప ఇంకెవరూ చంద్రబాబును కలవటానికి రావటం లేదు. కొద్ది రోజులు మాత్రం టైం టేబుల్ ఇచ్చి మరీ పరామర్శలకు కొందరిని పిలిపించుకున్నారు. వాళ్ళు రోజు వచ్చి ‘మీరు ఓడిపోవటం ఏమిటయ్యా’ అంటూ దీర్ఘాలు తీసి ముక్కు చీదుకుని చంద్రబాబును కావలించుకుని భోరుమని ఏడ్చి వెళ్ళిపోయేవారు.

 

నేతలు మాత్రం ఎన్ని రోజులని ఇలా జనాలను పోగేసి అరిగిపోయిన రికార్డును ప్లే చేస్తారు ? అందుకనే ఆ ప్రహసనం కూడా తగ్గిపోయింది. అదే సమయంలో ఎలాగూ ఖాళీ దొరికిందిత కదా అంటూ చంద్రబాబు తరచూ విజయవాడ నుండి హైదరాబాద్ కు కూడా వస్తున్నారు. ఏపిలో ఎక్కడున్న ఎవరో నేతలు వస్తుంటారు కాబట్టి సరిపోతోంది. మరి హైదరాబాద్ లో అలా కుదరదు కదా ?

 

అందుకనే నేతలను శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చి చంద్రబాబును రిసీవ్ చేసుకొమ్మని పార్టీ ఆఫీసు నుండి నేతలకు ఎస్ఎంఎస్ పంపి బతిమలాడుకుంటున్నారు. నిజానికి తెలంగాణాలో చంద్రబాబును రిసీవ్ చేసుకోవటానికి నేతలు కూడా ఎక్కువమంది లేరు. అందుకనే ఏపికి చెందిన నేతలు ఎవరైనా హైదరాబాద్ లో ఉంటే శంషాబాద్ కు వెళ్ళాలంటూ చెబుతున్నారు. అధికారంలో ఉన్నపుడు గుర్తుకురాని నేతలను కూడా ఇపుడు చంద్రబాబు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: