పివిపి అనగానే బ్రహ్మోత్సవం, ఊపిరి, మహర్షి లాంటి భారీ బడ్జెట్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత మనకు గుర్తుకు వస్తాడు . ఈ నిర్మాత 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుండి విజయవాడ ఎంపీ సీటుకోసం పోటీ చేసాడు. కానీ ఎన్నికల్లో గెలవలేకపోయాడు. ఎన్నికల్లో పివిపి పోటీ చేసినపుడు ప్రత్యర్థి పార్టీ ఎంపీ పివిపి పై చాలా ఆరోపణలు చేసాడు. అలా ఆరోపణలు చేసినందుకు ప్రస్తుతం పివిపి అతనికి నోటీస్ ఇచ్చినట్లు సమాచారం. 
 
అతనితో పాటు ఆ ఆరోపణలు ప్రసారం చేసిన రెండు టీవీ ఛానెళ్ళపై కూడా భారీ మొత్తంలో పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న వ్యక్తికి ఇచ్చిన నోటీసులో తనకు క్షమాపణ చెప్పాలని, ఆ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను తొలగించాలని కోరినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇది జరగని పక్షంలో దావా వేయాలని పివిపి నిర్ణయించుకున్నట్లు సమాచారం. 
 
ఆ ఎంపీ నోటీసులకు స్పందించి క్షమాపణ చెబితే ఏ సమస్యా ఉండదు కానీ చెప్పకపోతే మాత్రం ఈ కేసు ఖచ్చితంగా పెద్దది అయ్యే అవకాశం ఉంది. ఆ రెండు టీవీ ఛానెళ్ళు కూడా ఈ కేసు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మరి ఈ గొడవను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటారో లేక గొడవను పెద్దది చేసుకుంటారో చూడాలి. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: