ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగిన తర్వాత ఏపి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు.  అప్పటి నుంచి ఏపిలో ఎన్నో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. అయితే గత ఆరు సంవత్సరాల నుంచి రెండు రాష్ట్రాల గవర్నర్ గా నరసింహన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.  ఆ మద్య ఆయన తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా తప్పకుంటున్నారని ఆయన స్థానంలో కొత్తవారు నియమితులు అవుతున్నారని తెగ వార్తలు వచ్చాయి. 

కానీ ఆ మార్పులు మాత్రం జరగలేదు. ఈ మద్య గవర్నర్ నరసింహాన్ ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత కొత్త మార్పులు జరుగుతున్నాయి.  తాజాగా నరసింహాన్ స్థానంలో విశ్వభూషణ్ హరిచందన్ ను  నియమించింది. ఈ మేరకు మంగళవారం నాడు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి రాష్ట్రాలకు గవర్నర్ గా ఇప్పటి వరకు నరసింహాన్ కొనసాగిన విషయం తెలిసిందే. 

తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి కొత్త గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ కొనసాగుతారు. మొత్తానికి ఈసారి ఆంధ్రప్రదేశ్ కి కొత్త గవర్నర్, కొత్త ముఖ్యమంత్రి మరి ఏ రేంజ్ లో అభివృద్ది చేస్తారో అని ప్రజలు ఎంతో ఆశగా చూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: