2019 ఎన్నికల్లో కేవలం 23 ఎమ్మెల్యే సీట్లు, 3 లోక్ సభ ఎంపీ సీట్లు గెలుచుకుంది తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్లో బలహీనపడిన తెలుగుదేశం పార్టీని పార్టీ ఫిరాయింపులు మరింత ఇబ్బంది పెట్టాయి. నలుగురు రాజ్యసభ ఎంపీలు టీడీపీని వదిలి బీజేపీలో చేరారు. 23 మంది ఎమ్మెల్యేలలో కూడా 18 మంది ఎమ్మెల్యేలు టీడీపీని వదిలి బీజేపీ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీలో చేరటం లేదని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. 
 
టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీ పార్టీతో టచ్ లో లేరని, ప్రస్తుతం టీడీపిలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఎవరూ బీజేపీలో చేరటం లేదని కానీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మాత్రం బీజేపీలో చేరబోతున్నారని స్పష్టం చేసారు. ఇతర పార్టీల నుండి వచ్చే నాయకుల్ని బీజేపీలో చేర్చుకుంటామని కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. 
 
2024 ఎన్నికలలోపు ఏపీలో టీడీపీ స్థానంలోకి బీజేపీ వస్తుందని, ఏపీలో బీజేపీ బలపడబోతుందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీలో చేరకపోవడం అనే వార్త చంద్రబాబు నాయుడుకు ఎంతో సంతోషాన్ని ఖచ్చితంగా కలిగించేదే ఎందుకంటే ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారితే పార్టీకి అన్ని విధాలుగా ఇబ్బందులు తప్పవు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు ఎంతో ఊరట కలిగించేవే అని చెప్పవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: