ఇటీవల తెలంగాణలో ఎన్నికల జరిగిన నేపథ్యంలో టీఆర్ఎస్ అఖండ విజయం సాధించిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ సత్తా చాటుతూ వచ్చింది.  త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే.  నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన 2019, జులై 17వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకే ప్రగతి భవన్‌లో భేటీ కానుంది.


ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ మంచి విజయం సాధించినా..ఎంపీ ఎన్నికల్లో మాత్రం కాస్త నిరాశపరిచింది.  ఈ రోజు సమావేశంలో మున్సిపల్‌ చట్టంలో భారీ ఎత్తున మార్పులు తేవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా నూతన పురపాలక చట్టం ముసాయిదాను రూపొందించారు.  అధికారులు సిద్ధం చేసిన ముసాయిదాను పరిశీలించిన కేసీఆర్‌. మున్సిపల్‌ పట్టణాలకు, కార్పొరేషన్లకు సంబంధించి కొత్త విధివిధానాలను సిద్ధం చేసిన ప్రభుత్వం... గ్రేటర్‌ హైదరాబాద్‌కు కూడా ప్రత్యేకంగా పలు నిబంధనలు రూపొందించినట్లు తెలుస్తోంది. 


అవినీతి రహిత పాలన పట్టణాల్లో అందించడమే లక్ష్యంగా నూతన చట్టాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది.మున్సిపల్‌ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఓవైపు ఏర్పాట్లు చేస్తూనే.. ప్రభుత్వపరంగా కొత్త చట్టం తీసుకొచ్చి పట్టణాల్లో పాలనాపరమైన మార్పులు తేవాలని సీఎం పావులు కదుపుతున్నారు.  ఈసారి మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని..మంత్రులు, ఎమ్మెల్యేలు దీనిపై దృష్టి పెట్టాలనని సూచించనున్నట్లు సమాచారం. మంత్రిమండలి ఆమోదం అనంతరం గురు, శుక్ర వారాల్లో జరిగే శాసనసభ, మండలి సమావేశాల్లో మున్సిపల్‌ చట్టానికి ఉభయ సభలు ఆమోదం తెలుపనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: