మన దేశ పౌరుల పాపమో రాజ్యాంగం విధించిన శాపమో మన రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది. అధికార పగ్గాలు కోసం ఏమైనా చేద్దాం అనే సంస్కృతి నేటి మన రాజకీయ వ్యవస్థలో సుస్పష్టంగా కనబడుతుంది. పరస్పర నిందారోపణలు నిత్యకృత్యమయ్యాయి. ఎటు చూసినా అధికార దాహం, ఆత్మస్తుతి, పరనింద పెచ్చు పెరిగిపోయాయి.


అధికార విపక్షాల ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య ఏది సత్యము ఏది అసత్యము అనేది తెలుసుకోలేని బడుగు జీవులుగా మారిపోతున్నది మన దేశ ప్రజానీకం. మన పక్క రాష్ట్రం కర్ణాటకలో జరిగిన సంక్షోభాన్నిగమనిస్తే అక్కడి అధికార విపక్షాలు ఆడుతున్న రాజకీయ చదరంగం అధికారం కోసం అతి జుగుప్సాకరంగా నైతిక విలువలకు తిలోదకాలిచ్చి ఆడుతున్న నాటకం ఎంత హేయంగా ఉందో మనందరికీ తెలుసు.


పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం అన్న చందంగాగురువారం విశ్వాస పరీక్ష ఎదుర్కోబోతున్న కర్ణాటక సర్కారు, ఎలాగైనా అధికార పీఠాన్ని అధిరోహించాలన్న బీజేపీ సంకల్పం.మనకి రాజకీయ వ్యభిచారాన్ని కళ్లకు కడుతుంది. విశ్వాస ప్రకటన తేదీయే తడవుగా అన్ని రాజకీయ పక్షాలు ప్రజా ప్రతినిధులు నీ విలాసవంతమైన శిబిరాల్లో సేదతీర్చడం సామాన్య ప్రజానీకానికి కంపరం కలిగిస్తోంది.


గతంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు గద్దె దించడానికి చంద్రబాబు నాయుడు చేసిన వెన్నుపోటు రాజకీయం, వైస్రాయ్ హోటల్ కథ ఆంధ్ర ప్రజానీకానికి సుపరిచితమే. నేటికీ చంద్రబాబు నాయుడు గారు ఆ విషయమై జవాబు చెప్పుకోలేని పరిస్థితి జగద్విదితమే.  పై పై ఉదంతా లను గమనిస్తే తిలా పాపం తలా పిడికెడు పంచుకున్న చందంగా రాజకీయ నాయకులంతా తమ స్వలాభం కోసం రాజ్యాంగాన్ని ఎంత చక్కగా వాడుకున్నారో అన్నది మనం గమనించవచ్చు. నేటి రాజకీయ వ్యవస్థ స్వలాభం కోసం ఎటువంటి నీచానికి అయినా దిగజారుతుందని మనకి అర్థమవుతున్నది


మరింత సమాచారం తెలుసుకోండి: