గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుతం 2013 లో పాఠశాలలను ప్రారంభించింది. అక్షరాస్యతలో వెనుకబడిన ప్రాంతాల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్ మీడియేట్ వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించేలా కేంద్ర ప్రభుత్వం ఈ పాఠశాలలను నిర్మించింది. అంతే కానుండా బాలికల విద్యను మరింతగా ప్రోత్సహించేందుకు ఆదర్శ వసతి గృహాలను నిర్మించింది. జిల్లాలో గత ఏడాది అన్ని చోట్లా ఈ వసతి గృహాలను అందుబాటులోనికి  తీసుకువచ్చారు. కానీ పూర్తిస్థాయిలో ఈ వసతి గృహం గదుల నిర్మాణాలను చేపట్టకుండా వదిలేశారు. దీంతో దూర ప్రాంత్రాలనుంచి వచ్చే విద్యార్థులు వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు. 

జిల్లాలో ఈ గృహాల నిర్మాణాలను చేపట్టి గత ఏడాది నుంచే అందుబాటులోనికి తీసుకొచ్చారు. దీంతో ఆదర్శ పాఠశాలలో సీట్లకు డిమాండ్ పెరిగింది. ఒక్కో వసతి గృహంలో 100 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించాల్సి ఉంది. కానీ జిల్లాలో వసతి గృహాల గదులను పూర్తిస్థాయిలో నిర్మించక  పోవడంతో   కొందరు  మాత్రమే  ప్రవేశం పొందగలిగారు.
 
జిల్లాలో 14 ఆదర్శ వసతి గృహాలున్నాయి. కానీ వీటిలో కొన్ని వసతి గృహాలకు  మాత్రమే పూర్తిస్థాయి వసతులను కలిగి ఉన్నాయి విద్యార్థులు అంటున్నారు. ఒక్కో గదిలో నలుగురు విద్యార్థినులు చొప్పున 25 గదుల్లో 100 మందికి ప్రవేశాలు కల్పించాల్సి ఉంది. కానీ వీటిని పూర్తిస్థాయిలో  నిర్మాణించ పోవడంతో  తమకు పూర్తిస్థాయిలో ప్రవేశాలు అందడం లేదని  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి సైకిళ్ళు , ఆటోలపై రాకపోకలు చేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కొందరు విద్యార్థినులు వాపోతున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: