అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జగన్ ను ఉద్దేశించి ప్రశంసల వర్షం కురిపించారు. రైతులు పూర్తి సంతృప్తితో జగన్ ప్రభుత్వం కోసం ఎదురుచూసారని, ఏదో ఆశతో ఆయనొస్తే ఏదో చేస్తాడు తప్పనిసరిగా మా బ్రతుకులు బాగుపడతాయని రైతులందరూ కూడా ఆలోచించారని అదే విధంగా రైతులకోసం రూపొందించిన బడ్జెట్ అమలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని జనసేన ఎమ్మెల్యే అన్నారు. మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఇస్తున్న డబ్బులు పెంచటం వలన మత్స్యకారులు కోరకుండానే కోరికలు తీర్చేది జగమోహన్ రెడ్డే అని తనకు చెప్పారని రాపాక వరప్రసాద్ అన్నారు. 
 
సముద్రంలో ఎవరైనా ప్రమాదావశాత్తు మరణిస్తే వారికి పరిహారం ఇవ్వటం, 50% నామినేటెడ్ పదవులు బలహీన వర్గాలకు ఇస్తానని చెప్పటం గొప్ప విషయమని అన్నారు. 108, 104 వాహనాల వలన ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని రాపాక వరప్రసాద్ అన్నరు. ఐదేళ్ళలో 25 లక్షల ఇళ్ళు కట్టిస్తాననడం హర్షణీయం అన్నారు. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసే విషయం గురించి ఆలోచించమని జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇచ్చారు. 
 
జగన్మోహన్ రెడ్డి గారికి పదవి వారసత్వంగా లభించలేదని 2009లోనే జగన్ ముఖ్యమంత్రి కావాలని కానీ 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన కష్టంతో 2019లో ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. ఈ బడ్జెట్ ఎంత పారదర్శకంగా రూపొందించారో అదే విధంగా నెరవేర్చాల్సిన భాద్యత కూడా జగన్ పై ఉందన్నారు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. 



మరింత సమాచారం తెలుసుకోండి: