టీడీపీ అంటేనే దేశంలో అతి పెద్ద హిందూ ధార్మిక సంస్థ. హిందువులకు ఇంతకంటే పెద్ద్ద దిక్కూ దైవం వేరేగా లేరు. ప్రతి హిందువు మనసులో వెంకన్న కొలువు తీరి ఉన్నాడు. తమ కుటుంబంలోని వారి  పేర్లకు మొదటిగా స్వామి వారి పేరుని కలుపుకోవడం ఏళ్ళుగా ఆనవాయితీగా వస్తోంది. అంతటి నమ్మకం ఆ కలియుగ స్వామి వారి మీద. అటువంటి టీటీడీ విషయంలో


ఎవరైనా సాహసం  చేస్తారా. గత  బోర్డ్ చైర్మన్  పుట్టా సుధాకర్ యాదవ్  విషయంలో కూడా ఆయన క్రిస్టియన్ అని పెద్ద ఎత్తున హిందూ సంస్థలు గోల పెట్టాయి. అయితే తాను స్వామి వారి పరమ భక్తున్ని, పూర్తిగా హిందూ మత విశ్వాసం తెలిసిన వాడిని అని ఆయన చెప్పుకున్నారు. ఇపుడు వైవీ సుబ్బారెడ్డి వచ్చారు. ఆయన విషయం తీసుకుంటే జగన్ కి సొంత బాబాయి, మరి జగన్ ఇంట్లో క్రిస్టియన్ పద్ధతులు పాటిస్తారు, కాబట్టి సుబ్బారెడ్డి కూడా అలాగేనని మీడియా కోడై కూసింది. చివరికి తాను హిందువునేనని ఆయన నిరూపించుకున్న మీదటనే చైర్మన్ గా కన్ ఫర్మ్ చేశారు.


ఇపుడు  సినీనటుడు  ఆలీ పేరులోనే , ఆయన ముస్లిం  మతస్థుడ అని తెలిసిపోతుంది ఆయనకు టీడీపీ బోర్డ్ కు ఏమైనా సంబంధం ఉందా. ఆయన్ని టీడీపీ బోర్డ్ మెంబర్ని చేయమని సినీ విమర్శకుడు కత్తి మహేష్ కోరుతున్నారు. చేస్తే తప్పేంటని కూడా ప్రశ్నిస్తున్నారు. బీబీ నాచారమ్మని పెళ్ళి చేసుకున్న వెంకన్నకు లేని బాధ మీకెందుకు అయ్యలూ అంటూ ట్విట్టర్ యుధ్ధాన్ని కూడా మొదలెట్టేశాడు. నిజానికి జగన్ మనసులో ఏముందో తెలియదు కానీ అపుడే టీడీడీ బోర్డ్ కి ఆలీకి లింక్ పెట్టేస్తూ కత్తి చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చకు తెర లేపేశాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: