స‌స్పెన్స్ సినిమాను మించిన ఉత్కంఠతో సాగుతున్న పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాజకీయాలు మరో మలుపు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండువారాలుగా ఆ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలకు సుప్రీంకోర్టు తీర్పుతో తెరపడే అవకాశాల్తున్నాయి. తమ సభ్యత్వాలకు రాజీనామా చేసిన 15 మంది రెబల్‌ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రావాలని ఒత్తిడి చేయరాదని సుప్రీంకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. ఈ తీర్పు గురువారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతున్న కుమారస్వామి ప్రభుత్వానికి సంకట స్థితిని తెచ్చింది. రాజీనామా చేసిన రెబల్‌ ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకపోతే ప్రభుత్వం మైనార్టీలో పడిపోయి విశ్వాస పరీక్షలో ఓడిపోయే ప్రమాదం నెలకొంది. 


తమ సభ్యత్వాలకు రాజీనామా చేసిన 15 మంది రెబల్‌ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రావాలని ఒత్తిడి చేయరాదని సుప్రీంకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. ఈ తీర్పు గురువారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతున్న కుమారస్వామి ప్రభుత్వానికి సంకట స్థితిని తెచ్చింది. రాజీనామా చేసిన రెబల్‌ ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకపోతే ప్రభు త్వం మైనార్టీలో పడిపోయి విశ్వాస పరీక్షలో ఓడిపోయే ప్రమాదం నెలకొన్నది. దీంతో కొన్ని సాంకేతిక కారణాలను చూపించి బలపరీక్షను వాయిదా వేయించేందుకు అధికార పార్టీల నేతలు స్పీకర్‌తో భేటీ అయ్యారు. స్పీకర్‌ తీసుకునే నిర్ణయంపైనే కుమారస్వామి సర్కార్‌ భవితవ్యం ఆధారపడి ఉంది. 


అయితే, అసెంబ్లీలో గురువారం జరుగనున్న విశ్వాస పరీక్షను సాంకేతిక అంశాలను అడ్డం పెట్టుకొని వాయిదా వేయించాలని కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీలు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ కొన్ని అంశాలను స్పీకర్‌ ముందుంచినట్టు సమాచారం. సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందం బుధవారం స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ను కలిసి కొన్ని సాంకేతిక అంశాలను ఆయన ముందు ఉంచింది. రెబల్‌ ఎమ్మెల్యేలకు విప్‌ను జారీ చేసే తమ హక్కును సుప్రీంకోర్టు తొక్కి పెట్టిందని, అయినా తమకు విప్‌ను జారీ చేసే హక్కుందని తెలిపారు. సుప్రీంకోర్టు తమ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. మరో సాంకేతిక అంశాన్నీ కాంగ్రెస్‌ స్పీకర్‌ ముందుంచింది. ‘అసెంబ్లీ జరుగుతున్నప్పుడు సభ్యులంతా హాజరు కావాలి. ఒకవేళ వారు గైర్హాజరు కాదలచుకుంటే స్పీకర్‌ అనుమతి తీసుకోవాలని అసెంబ్లీ నిబంధనలు సూచిస్తున్నాయి. రెబల్‌ ఎమ్మెల్యేలు సభ అనుమతి లేకుండా ముంబైలో మకాం వేశారు. కాబట్టి ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని విశ్వాస పరీక్షను వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలి’ అని కాంగ్రెస్‌ పార్టీ స్పీకర్‌ను కోరింది. 


మరోవైపు బలపరీక్ష నిర్వహించాల్సిందేనని ప్రతిపక్ష బీజేపీ పట్టుబడుతోంది. స్పీకర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారన్నదానిపై సీఎం కుమారస్వామి ప్రభుత్వ భవితవ్యం ఆధారపడి ఉంది. సుప్రీంకోర్టుతీర్పు రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి లభించిన విజయమని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు యెడ్యూరప్ప అన్నారు. రెబల్‌ ఎమ్మెల్యేలకు లభించిన నైతిక విజయం కోర్టు తీర్పు అని చెప్పారు. సీఎం కుమారస్వామి గురువారం తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: