ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మాజీమంత్రి నారా లోకేష్, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ల మద్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుకుంది. అధికార పక్షం ఆరోపిస్తున్నట్లు తమ సొంత కంపెనీకి ప్రభుత్వ నిధులు మల్లించారని ఆరోపణలు చేస్తున్నారు కదా..సాక్షాదారాలు ఉన్నాయా అని లోకేష్ అధికార పక్ష నేత మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ని ప్రశ్నించారు.  అంతే కాదు జగన్ పదహారు నెలలు జైలుకు వెళ్లి వచ్చారని..ఆయనే డబ్బులు అడ్డగోలుగా దోచుకున్నారని.. ఇప్పటికీ ఆయనపై పదకొండు చార్జిషీట్లు ఉన్నాయని అన్నారు. 


దీనికి మంత్రి అనీల్ కుమార్ యాదవ్  ఘాటుగానే స్పందించారు.  రాష్ట్రంలో ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్లు ఎన్నో ఉన్నాయని..తెలుగు కోచింగ్ సెంటర్లు పెడితే బాగుండని, ఇక్కడ మంగళగిరిని మందలగిరి అని జయంతిని వర్దంతి అన్న నారా లోకేష్ గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారని విమర్శించారు. కనీసం మాతృభాష కూడా మాట్లాడటం చేతకాని వీళ్లు తమకు నీతులు చెప్తున్నారంటూ విరుచుకుపడ్డారు.   


మంత్రి నారా లోకేష్‌కు మాతృభాషలో ట్రైనింగ్ ఇప్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. అర్థరాత్రి చిదంబరం కాళ్లు పట్టుకొని కాంగ్రెస్ తో కుమ్మక్కై అయిన మీరు మాకు నీతులు చెబుతున్నారా..ఏనాడైనా ఒంటరిగా పోటీలో దిగారా..ఎప్పుడు పొత్తు బతుకే మీది అని విమర్శించారు.  ఒంటరిగా పోరులోకి దిగి 151 సీట్లు గెల్చుకొని మా నాయకుడు జగన్ సీఎం అయ్యారని అదీ గొప్ప..మీ వల్ల అవుతుందా అని ప్రశ్నించారు అనీల్ కుమార్ యాదవ్. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనగోలు చేసి ఇప్పుడు నీతికబుర్లు చెప్తున్నారని విరుచుకుపడ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి: