ఆంధ్రాలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , తెలంగాలో కేసీఆర్ పాలన బాగుందని , వీరు అన్నాదముల్లా పనిచేస్తుండడంతో రెండు రాష్ట్రాలలోను ప్రజలంతా హర్షిస్తున్నారని ప్రముఖ చిత్ర నటుడు డైరెక్టర్ , పీపుల్స్  స్టార్ ఆర్ నారాయణమూర్తి అన్నారు. మార్కెట్ లో ' ప్రజాస్వామ్యం సినిమా' విజయయాత్ర సందర్భగా జిల్లాలో  ఆయన సందడి చేశారు. పలాస  నుంచి ఈ 'యాత్ర' ప్రారంభించి కాశిబుగ్గ భాస్కరారామ థియేటర్  కు చేరుకున్నారు. అక్కడ ఈయన్ను చూసేందుకు అధిక సంఖ్యలో మహిళలు, అభిమానులు వచ్చి  ఫోటోలు , సెల్ఫీ లు దిగారు.  అనంతరం ఈయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్ ఏడాదిపాటు 'పాదయాత్ర'  చేయడంతో ప్రజలు కష్టాలను తెలుసుకున్నారని , ఆదిశగా మంచి పరిపాలన అందించడం శుభపరిణామమన్నారు.

తన 30 ఏల్ల సినీ చరిత్రలో ఇరవై ఏల్ల పాటు ప్రజలు బ్రహ్మరథం పట్టరాని , ఇటీవల పదేళ్లలో ఈ సినిమా తనకు పెద్దహిట్ అని ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబ సమితంగా చూడదగ్గ సినిమా అన్నారు. విడుదలైన మొదటి రెండు రోజులు కలెక్షన్ రాలేదని, అనంతరం ఊపందుకుందనీ ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 
ఓటు విలువ తెలిపే చిత్రం 

అంబెడ్కర్ రాజ్యాంగంలో రాసి ఓటు హక్కును మనకు ఇచ్చారని , అటువంటి వజ్రాయుధం లాంటి ఓటును  అమ్ముకోకూడదని ఈ సినిమా సందేశమని ఆయన అన్నారు. పది శాతం ధనవంతులు 90 శాతం  ప్రజలను పరిపాలిస్తున్నారని, అటువంటి సందర్భంలో సామాన్యులు ఎమ్మెల్యేగా ఎప్పుడవుతారని ప్రశ్నించారు. రూ. కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్యేగా గెలిచాక తిరిగి సంపాదించుకుంటారని దుయ్యబట్టారు. ఇదివరకూ ఒరేయ్ రిక్షా, దండోరా, ఎర్రసైన్యం , చీమదండు చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందిన వచ్చిందన్నారు. 'పీపుల్స్ వార్' చిత్రం ఈ  ప్రాంతంలో తీసిందే అని గుర్తు చేశారు. ఈ చిత్రంలో నటించిన  శ్రీకాకుళం నగరానికి చెందిన రాజేశ్వరి మాట్లాడుతూ నాటకంలో తన నటనను చూసి ఆర్ నారాయణమూర్తి సినిమాలో అవకాశం ఇచ్చారని ఆమె అన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: