సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అందివస్తున్న టెక్నాలజీపై అవగాహన లేక చాలామంది ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడి లక్షలు పోగొట్టుకుంటున్నారు. గతంలో ఫలానా బ్యాంక్ నుంచి ఫోన్ చేసి పిన్ నెంబర్ అడిగి తెలుసుకుని సొమ్ము కాజేసిన మోసాలు ఇప్పుడు పాతబడిపోయాయి.


ఇప్పుడు సరికొత్త పద్దతుల్లో మోసాలు చేస్తున్నారు. అలాంటి వాటిలో ఈ ఎనీడెస్క్ యాప్ ఒకటి. బ్యాంకు నుంచో, పేటీఎం నుంచో కాల్ చేస్తున్నామంటున్న నేరగాళ్లు ఈ ఎనీడెస్క్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోమని వినియోగదారులకు చెబుతున్నారు. అలా ఒక్కసారి ఈ ఎనీడెస్క్ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే చాలు..


ఇక వారు అక్కడి నుంచి మీ మొబైల్ ను తమ ఆధీనంలోకి తీసుకుని మీ బ్యాంకు ఖాతాల్లో సొమ్ము మాయం చేసేస్తారు. ఇటీవల హైదరాబాద్ లో ఇలాంటి ఉదంతాలు కొన్ని జరుగుతున్న దృష్ట్యా ఈ యాప్ జోలికి పోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


మీ బ్యాంకు వివరాలు అప్ డేట్ చేస్తామంటూ ఫోన్ చేసే సైబర్ నేరగాళ్లు.. వినియోగదారులతోనే ఈ యాప్ ను డౌన్ లోడ్ చేయిస్తున్నారు. ఒక్కసారి ఈ యాప్ డౌన్ లోడ్ చేస్తే ఇక అంతే సంగతులు.. అందుకే తస్మాత్ జాగ్రత్త.


మరింత సమాచారం తెలుసుకోండి: