తమిళనాడుకు చెందిన ఏడుగురు గంజాయి స్మగ్లర్లను రావులపాలెం పోలీసులుఅరెస్టు చేసి   వారినుండి  460 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో దీని విలువ 46 లక్షల రూపాయలు ఉంటుందని అన్నారు. గురువారం రావులపాలెం సర్కిల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో అమలాపురం డిఎస్పీ రాజాపు రమణ విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ  పోలీసులకు అందిన సమాచారం మేరకు తనికీల్లో భాగంగా రావులపాలెం పోలీసులు వీరిని చాకచక్యంగా  పట్టుకున్నట్లు తెలిపారు. వీరినుండి గంజాయితో పాటు, రవాణా కి ఉపయోగించిన ఇన్నోవా, మహేంద్రా వాహనాలను,10 సెల్ ఫోన్లు, 38వేల నగదు కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. 

విశాఖ జిల్లా పాడేరులో పండించిన గంజాయిని తమిళనాడు మీదుగా విదేశాలకు తరలిస్తున్నట్లు  గుర్తించామన్నారు. తమిళనాడు రాష్ట్రం తేనె జిల్లాకు చెందిన 7 గురు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు, కేసు నమోదు చేసి ముద్దాయిల ను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డిఎస్పీ వివరించారు.
 
మరో ముగ్గురు స్మగ్లర్లు పరారయినట్లు, వారికోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయన్నారు.  ఈ సందర్భంగా సిఐ వాసిబోయిన కృష్ణ, ఎస్.ఐ. ఎండి నసిరుల్లా లను,  సిబ్బందిని డిఎస్పీ అభినందించారు .



మరింత సమాచారం తెలుసుకోండి: