ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడు లో రోడ్డు ప్రమాదం జరిగి పది మంది మృతి చెందారు. మినీ వ్యాన్ – ట్రక్కు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. 14 మంది కార్మికులు కంచీపురం జిల్లా నుంచి తిరువూరు జిల్లాకు విద్యుత్ టవర్ల నిర్మాణ పనులకు ట్రక్కులో తరలివెళ్తున్నారు.


కోయంబత్తూరు నుంచి చెన్నైకు వెళ్తున్న మినీ వ్యాన్‌లో 26 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. కల్లాకుర్చి వద్ద ఈ రెండు వాహనాలు ఢీకొన్నాయి ఈ రెండు వామనాలు అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ ఎం. మణికండన్, వ్యాన్ డ్రైవర్ ఏ. రాజేంద్రన్‌తో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు.


అయితే 14 మంది కార్మికుల్లో 11 మంది జార్ఖండ్‌కు చెందినవారు ఉన్నారు. ప్రమాదం జరిగిన చోట శవాలు చెల్లాచెదురుగా పడిపోయాయి..మొత్తం రక్తసిక్తం కావడంతో  కల్లాకుర్చి – సేలం జాతీయ రహదారిపై మూడుగంటల పాటు ట్రాఫిక్‌జాం ఏర్పడింది. కల్లాకుర్చి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: