తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కమలం గూటికి చేరడం ఖాయమేనా ? అంటే  అవుననే అయన పరోక్షంగా చెప్పకనే చెబుతున్నారు .  గత కొన్ని రోజులుగా రాయపాటి సాంబశివరావు టిడిపిని వీడి బిజెపిలో చేరుతున్నారన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తుంది . తాను బీజేపీలో చేరే అంశంపై రాయపాటి తాజాగా స్పందిస్తూ బీజేపీ నేతలు తనని  పార్టీలోకి ఆహ్వానించిన  మాట నిజమేనని అంగీకరించారు.


 బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్  తన ఇంటికి వచ్చి చర్చలు జరిపారన్న ఆయన.ఈ విషయాన్నీ  టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్లానని  అన్నారు .   బిజెపిలో చేరే విషయమై తాను ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్న  రాయపాటి,  త్వరలోనే బీజేపీ లో చేరే విషయమై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు .  మరో వారం రోజుల వ్యవధిలో రాయపాటి సాంబశివరావు ఢిల్లీకి వెళ్లి బిజెపి అగ్ర నేతల సమక్షం లో ఆ పార్టీ లో చేరే  అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నర్సరావుపేట నుంచి గత ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించిన రాయపాటి , ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు .


గుంటూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అనుచరగణం ఉన్న రాయపాటి , బీజేపీ లో చేరితే పార్టీ బలోపేతం అవుతుందని కమలనాథులు భావిస్తున్నారు . రాయపాటి సాంబశివరావు టీడీపీ వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండగా అయన   కుమారుడు రాయపాటి రంగారావు మాత్రం టిడిపిని వీడేది లేదని స్పష్టం చేస్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: