ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఆర్ధిక సహాయం అందించరాదంటూ  ప్రపంచం బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకోవడం హాట్ టాఫిక్ గా మారింది .  ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి కి రెండు వేల ఒక వంద కోట్ల రుణాన్ని ఇవ్వడానికి తొలుత సుముఖత వ్యక్తం చేసిన  ప్రపంచ బ్యాంక్ , ప్రస్తుతం ఆ మొత్తం రుణాన్ని నిలిపి వేయాలని నిర్ణయించింది.  తాజాగా ప్రపంచ బ్యాంకు తీసుకున్న నిర్ణయంతో అమరావతి రాజధాని నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి .


అమరావతి నిర్మాణానికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లో పెద్దగా నిధులు కేటాయించకపోవడం , ప్రస్తుతం ప్రపంచ  బ్యాంక్ కూడా రాజధాని నిర్మాణానికి సహకరించేందుకు  నిరాకరించడంతో రాజధాని నిర్మాణం ఇప్పుడప్పుడే పూర్తవుతుందా ? అన్న అనుమానాలు నెలకొన్నాయి .   గత ప్రభుత్వ హయాం లో  అమరావతి నిర్మాణం పై పెద్ద ఎత్తున  ఆరోపణలు రావడంతో ,  ప్రపంచ బ్యాంకు బృందం అమరావతిని సందర్శించి పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేయడమే  కాకుండా ఆర్థికంగా అండదండలు అందించాలని నిర్ణయించింది.  అయితే జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన కొద్ది  రోజుల వ్యవధిలోనే ప్రపంచబ్యాంక్ ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది .


  అమరావతి నిర్మాణం కోసం ఆసియా డెవలప్ మెంట్  బ్యాంక్ 400 కోట్ల రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.  అయితే ప్రపంచ బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆసియా  డెవలప్ మెంట్ బ్యాంక్ కూడా రుణాన్ని నిలిపి వేసే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: