జెఫ్‌ బెజోస్‌. అమెజాన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌(సీఈవో). ఈ సంస్థ సీఈఓగా ఎంత గుర్తింపు పొందారో...ఇటీవ‌లే త‌న భార్య‌కు ఇచ్చిన విడాకుల ద్వారా కూడా అంతే ప్రత్యేక‌త‌ను సంత‌రించుకున్నారు.బెఫ్‌ బెజోస్‌ తన భార్య మెకంజీ బెజోస్‌కు విడాకులు ఇస్తూ భారీగా భరణం సమర్పించున్నప్ప‌టికీ ప్రపంచంలో అత్యంత ధనవంతుల స్థానంలో మళ్లీ తొలిస్థానంలో నిలిచారు. బ్లూబర్గ్ బిలియనీర్‌ ఇండిక్స్‌ విడుదల చేసిన జాబితాలో 125 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో నిలిచారు. ఎల్వీఎంహెచ్‌ సీఈవో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌.. 108 బిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు.


మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ మాత్రం మూడో స్థానానికి పడిపోయారు. బిల్‌ గేట్స్‌ ఆస్తుల విలువ 107 బిలియన్ డాలర్లు.ఇప్పటికే  బిల్‌గేట్స్‌ తన సంపదలోని 35 బిలియన్‌ డాలర్లను గేట్స్‌ అండ్‌ మిలిందా సంస్థకు విరాళంగా ఇచ్చారు. దీంతో ఆయన సంపద 107 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇక ఆర్నాల్డ్‌ 2019లో ఇప్పటి వరకు 39 బిలియన్‌ డాలర్లు సంపాదించారు. ఈ జాబితాలో పేర్కొన్న టాప్‌ 500 మంది కుబేరుల్లో ఒక ఏడాదిలో అత్యధికంగా సంపాదించిన వారి జాబితాలో ఆర్నాల్ట్‌ తొలిస్థానంలో నిలవడం విశేషం. మహిళల సంపన్నుల జాబితాలో అమెజాన్ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ మాజీ భార్య మెకంజీ నాలుగో స్థానంలో ఉన్నారు. ఆమె నికర ఆస్తుల విలువ 40.3 బిలియన్ డాలర్లు. మొత్తంగా అయితే ఈమె 22వ స్థానంలో ఉన్నారు. ఇక ప్రపంచంలో అత్యంత ధనవంతురాలిగా ఫ్రాంకోయిస్‌ నిలిచారు.


భారతదేశంలోని కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మొదటి స్థానంలో నిలిచారు. దేశంలోనే అత్యంత ధనవంతుడిగా మరోసారి తొలిస్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ 51.8 బిలియన్‌ డాలర్లు. ప్రపంచ వ్యాప్తంగా 13 వ స్థానంలో ఉన్నారు. అంబానీ తర్వాత స్థానంలో విప్రో అధినేతఅజీమ్‌ ప్రేమ్‌జీ 20.5 బిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా ఈయన 48వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. హెచ్‌సీఎల్‌ టెక్‌ శివ నాడార్‌ 92 స్థానంలో, కొటాక్‌ మహీంద్రా ఎండీ ఉదయ్‌ కొటాక్‌ 96స్థానంలో నిలిచారు.



మరింత సమాచారం తెలుసుకోండి: