రాజీవ్ హత్య కేసు నిందితుడు విడుదల అంశం రాజ్ భవన్ కోర్టుకు చేరింది. హై కోర్ట్ స్పందించిన తీరుతో హంతకులకు చుక్కెదురైనట్లు అయింది. గవర్నర్ అధికారాల్లో తాము జోక్యం చేసుకోబోమని, తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమంటూ నిందితురాలు నళిని దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయమూర్తులు సుబ్బయ్య, శరవణన్ బెంచ్ తిరస్కరించింది. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులైన నళిని, మురుగన్, శాంతన్,పేరరివాల్, రవిచంద్రన్ తో ఏడుగురి విడుదల వ్యవహారం రాష్ట్రంలో దుమారాన్ని రేపుతూ వస్తోంది.

రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించినా.. రాజ్ భవన్ లో స్పందన లేని దృష్ట్యా చివరకు గవర్నర్ భన్వరీలాల్ ను ప్రశ్నిస్తూ నిందితుల తరపున నిందితుడు రవిచంద్రన్ తొలుత ఒక లేఖ కూడా రాశారు. నిర్ణయం ఏమిటో స్పష్టం చేయాలని కోరాడు. అలాగే ముంబై పేలుళ్ల కేసులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విడుదల అంశంలోని కీలక సమాచారాన్ని మరో నిందితుడు పేరరివాల్ సేకరించాడు. ఆ మేరకు ఆయనకో న్యాయం.. తమకో న్యాయమా? అని ప్రశ్నించే పనిలో పడ్డారు. అలాగే మహిళా నిందితురాలు నళిని అయితే , రాజ్ భవన్ లో మంత్రి వర్గం తీర్మానం ఆమోదించే విధంగా గవర్నర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ గత కొన్ని నెలలుగా అన్యాయమూర్తులు సుబ్బయ్య, శరవణన్ నేతృత్వంలోని బెంచ్ ముందు విచారంలో ఉంది. అలాగే మరో ఇద్దరు నిందితులు రవిచంద్రన్, రాబర్ట్  దాఖలు చేసుకున్న పిటిషన్ సైతం హైకోర్టు న్యాయమూర్తులు సుందరేష్, నిర్మల్ కుమార్ నేతృత్వంలోని బెంచ్ ముందు విచారంలో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: