విశాకపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావుకు ఎన్ఐఏ కోర్టు షాక్ ఇచ్చింది. నిందితుడి బెయిల్ ను రద్దు చేసి వెంటనే కస్టడీలోకి తీసుకోవాలంటూ ఆదేశాలిచ్చింది.

 

ఎయిర్ పోర్టులో జగన్ పై పోయిన ఏడాది అక్టోబర్ 25వ తేదీన శ్రీనివాస్ దాడి చేసిన విషయం తెలిసిందే. ముందు పోలీసు కస్టడీలో విచారణ నిమ్మితం ఉన్న శ్రీనివాస్ ప్రస్తతం రాజమండ్రి సెంట్రల్ జైల్లోను ఉంటున్నాడు.

 

అయితే నిందితుడికి బెయిల్ ఇవ్వాలని అడగ్గానే మొన్న మేనెలలో కోర్టు మంజూరు చేసింది. అయితే కేసు విచారణ ఇంకా పూర్తి కాకుండానే బెయిల్ ఎలా ఇస్తారన్న ఎన్ఐఏ వాదనతో కోర్టు ఏకీభవించి బెయిల్ ను రద్దు చేసింది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: