ఏపీ సీఎం చంద్రబాబును రాజకీయంగా చాణక్యుడితో పోలుస్తారు. కానీ రాను రాను చంద్రబాబు రాజకీయంలో కనీస ప్రమాణాలు కూడా ఉండటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు ఉదంతంలో ఆయన చేసిన విమర్శలు ఆయనపై ఉన్న గౌరవాన్నితగ్గించేలా ఉన్నాయి.


జగన్ ప్రభుత్వ వైఖరి కారణంగానే ప్రపంచ బ్యాంకు అమరావతి కోసం అప్పు ఇవ్వడం లేదని చంద్రబాబు విమర్శించడం విడ్డూరంగా ఉంది. ప్రపంచ బ్యాంకు లేఖ రాసేటప్పటికీ వైయస్‌ఆర్‌సీపీ అధికారం చేపట్టి కేవలం 12 రోజులు మాత్రమే అయ్యింది. అంటే ప్రపంచ బ్యాంకు తీసుకున్న నిర్ణయానికి పూర్తి బాధ్యత అంతకుముందున్న చంద్రబాబు సర్కారుదే.


బిహార్‌ పక్కా ప్రణాళికతో దూసుకుపోతేంటే ఏపీలో మాత్రం ఆయోమయ పరిస్థితి ఉందని మకీ సంస్థ కూడా రిపోర్టు ఇచ్చింది. అసలు ప్రపంచబ్యాంకు ఎప్పుడు రుణం ఇస్తామని చెప్పిందో చంద్రబాబుకు తెలియని విషయం కాదు. అంతే కాదు.. వాస్తవానికి ఏపీ రాజధానికి ప్రపంచ బ్యాంకు నిధులు ఇస్తామని ఎప్పుడూ చెప్పింది లేదు.


జరిగిందంతా రుణం కోసం ప్రయత్నం మాత్రమే. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు వెనక్కు వెళ్తుందంటే అందుకు కారణం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పని తీరు కారణంగానే. అంటే ఈ విషయంలో అసలు అసమర్థత చంద్రబాబుదైతే.. ఆయన తెలివిగా దాన్ని జగన్ కు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: