చంద్రబాబు తర్వాత తెలుగుదేశాన్ని నడిపించేది ఎవరు.. ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం సులభమే.. అందుకు ప్రస్తుతం వినిపిస్తున్న ఒకే ఒక పేరు నారా లోకేశ్. కానీ అదే లోకేశ్ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయి నైతికంగా బలహీనంగా ఉన్న పరిస్థితి నెలకొంది.


మరి నారా లోకేశ్ ఈ సమయంలో తనను తాను నాయకుడిగా నిరూపించుకోగలడా.. అందుకు అవకాశం వస్తుందా.. అసలు చంద్రబాబు వంటి మర్రి చెట్టు వంటి నాయకుడి కింద లోకేశ్ అనే చిన్న మొక్క వృక్షంగా మారుతుందా.. ఇవీ టీడీపీ సానుభూతిపరుల మదిలో మెదులుతున్న ప్రశ్నలు.


మరోవైపు.. ఇదే అదనుగా నారా లోకేశ్ ను రాజకీయంగా పాతాళానికి తొక్కేందుకు వైసీపీ సహజంగానే ప్రయత్నిస్తుంది. లోకేశ్ పై ఇప్పటికే ఉన్న పప్పు అనే మద్రను మరింతగా ఫోకస్ చేసి.. అతడినో అసమర్థనేతగా చిత్రించే ప్రయత్నాలు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి.


ఓవైపు ఎన్నికల్లో ఓటమి, మరోవైపు వైసీపీ నెగిటివ్ ప్రచారం.. మరోవైపు తండ్రి పెత్తనం.. వీటన్నింటినీ దాటుకుని ఓ బలమైన లీడర్ గా లోకేశ్ ఎదగడం అంత సులభమైన విషయమేమీ కాదు. అలాగని అసాధ్యమైన విషయమూ కాదు. మరి లోకేశ్ తాను ఎంతవరకూ నిరూపించుకుంటాడో కాలమే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: