ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 91 మంది డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ జీఓ ఆర్టీ  నెంబరు 1652 విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కొంత మందికి పదోన్నతలు మరికొంత మందికి బదిలీలు తప్పలేదు. ప్రభుత్వ పరిపాలనా సౌలభ్యం రీత్యా ఈ ఉత్తర్వులు జారీ చేసి తక్షణం వాటిని అమలు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది.


ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం రెవిన్యూ డివిజనల్‌ అధికారిగా ఉన్నవారికి జాయింట్‌ కలెక్టర్‌ - 2 గా పదోన్నతలు లభించాయి. జాయింట్‌ కలెక్టర్‌ - 2 స్థానంలో ఉన్నవారిని జిల్లా రెవిన్యూ అధికారిగా నియమించారు.  అదే విధంగా ప్రాజెక్ట్‌ డైరెక్టర్లుగా ఉన్నవారికి ఆర్‌డీఓలుగా బదిలీ అయ్యింది. మరికొంత మందిని ఆర్‌డీఓ గా ఒకచోట నుంచి మరో చోటకు బదిలీ చేశారు. 


ఈ మార్పులు చేర్పులతో రాష్ట్రంలో పరిపాలనా తీరు, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోనికి తీసుకువెళ్లేందుకు వీలవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ బదిలీలు, పదోన్నతల విషయం రెండు రోజుల క్రితమే బాహాటమైనా జీఓ మాత్రం 20వ తేదీన తయారైంది. 21వ తేదీన అది బయటకు విడుదలైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: