ప్రభాస్ కెరీర్‌లోనే మైలు రాయి వంటి సినిమా బాహుబలి.. ఈ సినిమా ప్రభాస్ కు దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు ఏదైనా గ్రాండ్ గా చెప్పాలంటే వాడుతున్న ఒకే ఒక్క పదం బాహుబలి.. అలా అదో ట్రేడ్ మార్క్ అయ్యింది.


ఇప్పుడు వైసీపీ కూడా ఈ బాహుబలి ఇమేజ్ ను వాడుకుంటోంది. ఇటీవల జగన్ లక్షల కొద్దీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే కదా. ఆ నియామకాలకు ఇప్పుడు వైసీపీ పెడుతున్న పేరు బాహుబలి నియామకాలు.. అవును.. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే వర్ణిస్తున్నారు.


గ్రామ సచివాలయాల కోసం భారీ స్థాయిలో కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టామంటున్న పెద్దిరెడ్డి ఇవి రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో రికార్డుగా వర్ణించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏకంగా 4.01 లక్షల కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టి రికార్డు సృష్టించారన్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా 11,114 గ్రామ సచివాలయాలు, 3786 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నామని పెద్దిరెడ్డి చెప్పారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు కలిపి మొత్తంగా 3,65,561 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. సుమారు 2.30 లక్షల గ్రామ వలంటీర్లను నియమిస్తున్నామని తెలిపారు. ఈ స్థాయిలో ఏ సీఎం కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని, ఇవి బాహుబలి నియామకాలని ప్రశంసించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: