ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. జగన్ సర్కారు. డెబ్బై శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలన్న బిలుతో పాటు నామినేటెడ్ పదవులలో బలహీనవర్గాలకు , మహిళలకు ఏభై శాతం పదవులు ఇవ్వాలని, నామినేటెడ్ కాంట్రాక్టులలో ఏభై శాతం బలహీనవర్గాలకు ఇవ్వాలన్న బిల్లును సోమవారం ప్రవేశ పెట్టింది.


ఈ సమయంలో టీడీపీ అనేక అభ్యంతరాలు లేవనెత్తుతూ అసెంబ్లీలో గొడవ చేసింది. దీంతో జగన్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఇలాంటి చారిత్రక బిల్లులు ప్రవేశ పెడుతున్నప్పుడు ప్రతిపక్షం గొడవ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇంత దిక్కుమాలిన ప్రతిపక్షం ఉండదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు.


బడుగు, బలహీన వర్గాలు, మహిళలకు మేలు చేకూర్చే బిల్లులను అడ్డుకోవాలని ప్రతిపక్షం చూస్తోందని జగన్ మండిపడ్డారు. 40 ఏళ్ల అనుభవం అంటే ఇదేనా? అని ఆయన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిని జగన్ నిలదీశారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ద్రోహం చేసిన వారిని ప్రజలే శిక్షిస్తారని తేల్చి చెప్పారు.


నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు సమాన అవకాశం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్లు చరిత్రలో ఎప్పుడూ కల్పించలేదని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఇక, స్టేట్‌మెంట్‌ ఎక్కడైనా ప్రభుత్వం ప్రవేశపెడుతుందని, దానికి క్లారిఫికేషన్‌ మాత్రమే ప్రతిపక్షం అడుగుతుందని జగన్ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: