మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.. 175 అసెంబ్లీ సీట్లు ఉంటే.. టీడీపీకి దక్కింది కేవలం 23.. 25 ఎంపీ సీట్లు ఉంటే.. టీడీపీ గెలుచుకుంది కేవలం మూడు... మూడంటే మూడే.. ఈ గణాంకాలు చూస్తే.. జనం తెలుగుదేశం పాలనను ఏ స్థాయిలో చీకొట్టారో అర్థమవుతుంది. ప్రజలను తెలుగుదేశం సర్కారు ఏ రేంజ్ లో కష్టాలపాలు చేసిందో సులభంగానే గ్రహించొచ్చు.


కానీ ఈ ఘోర పరాజయం నుంచి తెలుగు దేశం పార్టీ గుణపాఠాలు నేర్చుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం శుక్రవారం జరిగింది. ఎన్నికల్లో పరాజయం తర్వాత జరిగిన మొదటి సమావేశం.. ఈ సమావేశంలో ఓ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పరిస్థితి చంద్రబాబు పరిస్థితి చూసి.. ఏకంగా కన్నీరు పెట్టుకున్నారట.


మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో కానీ.. తెలుగుదేశం అనుకూల మీడియా మాత్రం అదే చెబుతోంది. ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై జరిగిన విశ్లేషణలో తెలుగుదేశం హయాంలో చేపట్టిన పనులు, కష్టపడిన తీరును అయ్యన్నపాత్రుడు గుర్తు చేసుకున్నారట. ఇంత చేసినా ప్రజలు వైసీపీకే ఎందుకు ఓట్లేశారని ఆయన తెగబాధపడిపోయారు. అంతే కాదు.. ఇప్పుడు అన్న క్యాంటీన్‌ల మూసివేత కారణంగా అందరూ బాధపడుతున్నారంటూ ఆ మంత్రిగారు కన్నీరు పెట్టుకున్నారట. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా.. అయ్యన్న పాత్రుడు .


మరో మాజీ మంత్రి ఏకంగా పొలిట్ బ్యూరో నే ప్రక్షాళన చేయాలని విజ్ఞప్తి చేశారట. ఆ మాజీ మంత్రి ఎవరో కాదు.. సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి. తెలంగాణ, ఆంధ్రాలో కొందరు పొలిట్ బ్యూరో సభ్యులు పార్టీ వదిలారు కాబట్టి.. ఇప్పుడు పార్టీని ప్రక్షాళన చేయడం మంచిదని సోమిరెడ్డి సలహా ఇస్తే...నీ కేం కుర్రాడిలాగానే ఉత్సాహంగా ఉన్నావని చంద్రబాబు కాంప్లిమెంట్ ఇచ్చాడట.


మరింత సమాచారం తెలుసుకోండి: