వైఎస్ జగన్ కూడా అచ్చం తండ్రిలాగానే వ్యవహరిస్తారు. ఆయన నమ్ముకున్న సిధ్ధాంతాన్ని దాటి ముందుకు వెళ్లరు. తాను మనసులో అనుకున్నది చేసి తీరుతారు. నమ్మినవారిని, వారి విశ్వాసాన్ని జగప్ ఎప్పటికీ వదులుకోరు. అందుకే జగన్ని మాట తప్పని, మడమ తిప్పని నేతగా చెబుతునారు. జగన్ తాను పదేళ్ల రాజకీయ జీవితంలో వెంట నడచిన వారిని గుర్తుంచుకున్నారు. వారి కోసం ఏమైనా చేస్తున్నారు కూడా.

 

ఇపుడు అదే విధంగా ముస్లిం మైనారిటీ నాయకుడు ఇక్బాల్ అహ్మద్ ని జగన్ ఏరి కోరి ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. జగన్ దీనికి సంబంధించి రంజాన్ వేళ సీఎం హోదాలో ప్రామిస్ చేశారు. ముస్లిం సోదరుల సమక్షంలో ఇక్బాల్ ని పెద్దల సభలో కూర్చోబెడతాను అన్నారు. అన్న మాట ప్రకారం ఆయనకు ఆ సీటు ఇచ్చారు.

 

అదీ కూడా ముస్లింల మరో సెంటిమెంట్ పండుగ అయిన బక్రీద్ వేళ జగన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో ముస్లిం సోదరులంతా ఆనందంతో ఉన్నారు. తమ పండుగ వేళ జగన్ ఇచ్చిన కానుకను మరచిపోలేమని కూడా అంటున్నారు. జగన్ ఈ విధంగా చేయడం ద్వారా ముస్లిమ మనసు చూరగొన్నారనే చెప్పాలి. జాగ్న్ కోసం ఏమైనా చేస్తామని ముస్లిం సోదరులు అంటున్నారంటే అది ఆయన మాట నిలుపుకున్న తీరుకు మెచ్చేనని చెప్పాలి.

 

ఇక ఇక్బాల్ అహ్మద్ హిందూ పురంలో సినీ నటుడు బాలక్రిష్ణ మీద పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఆయన పార్టీకి నిబద్ధతతో పనిచేస్తున్నారు. అందుకే జగన్ ఆయన్ని ఎంపిక చేశరని అంటున్నారు. ఈ మాజీ ఐపీఎస్ అధికారి రాజకీయల్లో తనదైన విలువలతో ముందుకు సాగుతున్నారు. పైగా జగన్ నిబద్ధతను మెచ్చి ఆయన వైసీపీలో చేరారు. ఇపుడు ఆయన సేవలకు తగిన గుర్తింపు లభించినట్లైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: