ప్రస్తుతం మార్కెట్ లో కిలో రైస్ కొనాలంటే కనీసం రూ. 50/-  పెట్టాలి.  అంతకంటే తక్కువ పెడితే నాణ్యమైన బియ్యం అందుతాయని గ్యారెంటీ లేదు.  ఒకప్పుడు ధరలు తక్కువుగా ఉండేవి.  కానీ, ఇప్పుడు ఈ ధరలు అమాంతం ఆకాశాన్ని తాకడంతో జనాలు భపడుతున్నారు.  ఈ భయాలు పక్కన పెడితే.. రైస్ తినాలి అంటే బియ్యాన్ని బాగా వండాలి.  మనం నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి వండుతారు.  


ఇలా కడిగి వండిన తరువాత ఇంకేం ఉంటుంది.  మనం తినేది ఒట్టి బియ్యం పిండిని తప్పించి మరేం ఉండదు.  బియ్యాన్ని వండకుండా తినలేము.  బియ్యాన్ని వండకుండా కూడా తినొచ్చని అలాంటి బియ్యం కూడా ఉంటాయని ఎవరకైనా తెలుసా.. ఎస్, వండకుండానే ఆ బియ్యం ఉడుకుతుంది.  మాములు రైస్ ఎలా ఉంటుంది అది కూడా అలానే ఉంటుంది.  ఇలాంటి రైస్ ను బోకా చావల్ అని పిలుస్తారు.  కొన్ని ప్రాంతాల్లో వీటికి మ్యాజిక్ రైస్ అనే పేరుంది.  ఇవి అస్సాంలో మాత్రమే పండుతాయి.  


ఈ బోకా చావల్ కు శతాబ్దాల చరిత్ర ఉన్నది.  మొఘల్ చక్రవర్తుల కాలంలో సైనికులు యుద్దానికి వెళ్లే సమయంలో ఈ బోకా చావల్ ను వెంట తీసుకెళ్లేవారు.  ఉడకబెట్టేందుకు సమయం ఉండదు కాబట్టి వీటిని తీసుకెళ్లేవారట.  అసలు ఈ రైస్ ను ఎలా వండుతారు చూద్దాం.  మాములుగా ఈ రైస్ ను కడిగి.. ఓ గంటపాటు నానబెడితే చాలు.. మాములు రైస్ అయినట్టుగా అవుతుంది.   చూసేందుకు ఇవి ముతక రైస్ లా ఉన్నా ఇందులో ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.  ఈ రైస్ శరీరంలో వేడిని తగ్గిస్తుంది.  


ఈ రైస్ లో  పెరుగు వేసుకొని తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది.  ఈ బోకా చావల్  అస్సాం దిగువ ప్రాంతాలైన నల్బారీ, బర్పెటా, గోల్పారా, కమ్రుప్, దర్రంగ్, దుబ్రీ, చిరంగ్, కోక్రఝార్, బక్సా ప్రాంతాల్లో మాత్రమే పండుతుంది. జూన్ నుంచి డిసెంబరు నెలల్లో వీటిని ఎక్కువగా పండిస్తారు.  ఆయా ప్రాంతాల్లో పండించే పంటను బట్టి ధర ఉంటుంది.  కొన్ని ప్రాంతాల్లో ధర రూ. 60 నుంచి రూ. 80  వరకు ఉంటుంది.  గౌహతి వంటి ప్రాంతాల్లో ఈ ధర రూ. 100 వరకు పలుకుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: