ఒక చిన్న ఐడియా జీవితాన్ని మారుస్తుంది అంటారు.  ఐడియాలు ఉంటె జీవితంలో ఎలాగైనా బతకొచ్చు.  చాలామంది విపరీతంగా కష్టపడుతుంటారు.  కానీ, దానికి తగ్గట్టుగా సంపాదన ఉండదు.  ఎదో కొద్దిపాటి సంపాదనతో కాలం వెళ్లదీస్తుంటారు.  తెలివితేటలు ఉన్న వ్యక్తులు ఆ తెలివిని, కొద్దిగా డబ్బును పెట్టుబడిగా పెట్టి కోట్లు సంపాదిస్తుంటారు.  డీ సినిమాలో చెప్పినట్టు మొదటి కోటి సంపాదించడం వరకే నాకు గుర్తుంది.  


ఆ తరువాత అవి ఎన్ని కోట్లు అయ్యాయో తెలియదు అని చెప్పినట్టు.. ఒకసారి ఒక వ్యాపారంలో సెట్ అయ్యాక.. ఆ వ్యాపారం  లాభాలు తెచ్చి  పెడుతుంది.  ఇలా లాభసాటిగా అనే వ్యాపారాలు చాలా ఉన్నాయి.  కావాల్సింది చిన్న దైర్యం అంతే.  చాలామంది వ్యాపారం అనగానే భయపడతారు.  వామ్మో ఎక్కడ డబ్బులు పోతాయేమో.. ఇబ్బందులు పడాలేమో అని.  


చిన్న చిన్న వ్యాపారాల్లో భయం ఉండదు.  లాభం ఉంటుంది. అలాంటి లాభసాటి వ్యాపారాల్లో ఒకటి టమోటాతో సాస్ బిజినెస్.  చాలా ఈజీ బిజినెస్ ఇది.  పెట్టుబడి తక్కువే.  పైగా సొంత డబ్బు కొద్దిగా పెట్టుకుంటే చాలు.  మిగతా డబ్బులు  ముద్రా లోన్ ద్వారా తీసుకోవచ్చు. టమాటో సాస్ కు సంబంధించి బ్రాండెడ్ కంపెనీలు ఎన్నో ఉన్నాయి.  అయినప్పటికీ లోకల్ బ్రాండింగ్ వాటికే విలువ ఎక్కువ.  


తక్కువ ధరకు ఇవి దొరుకుతుంటాయి.  మార్కెటింగ్ చేసుకోగలిగితే చాలు.  ఈజీగా నెలకు రూ. 40 వేల ఆదాయం తెచ్చుకోవచ్చు.   టమాటా సాస్ వ్యాపారానికి పెట్టుబడి సుమారు రూ.7.82 పెట్టుబడి కావాలి. ఇందులో మీరు రూ.2 లక్షలు మెషినరీ, ఎక్యుప్‌మెంట్ కోసం ఫిక్స్‌డ్ క్యాపిటల్ పెట్టాలి. వర్కింగ్ క్యాపిటల్ రూ.5.82 లక్షలు. టమాటా, రా మెటీరియల్, సిబ్బంది జీతాలు, ప్యాకింగ్, యూనిట్ మెయింటెనెన్స్ ఖర్చులన్నీ ఇందులో వస్తాయి. సంవత్సరానికి రూ. 30 లక్షల వరకు బిజినెస్ జరిగితే.. అన్ని ఖర్చులు కలిపి రూ. 25 లక్షల వరకు ఉంటుంది.   అంటే మిగులు 5 లక్షలు.  దీన్ని బట్టి నెలకు మీరు రూ. 40 వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు.  బిజినెస్ బాగుంది అనుకుంటే ఈ ఆదాయం మరింత పెరుగుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: