కొన్ని కొన్ని కథలు సినిమా స్టోరిల్లా ఉంటాయి.  కంటతడి పెట్టిస్తుంటాయ్.  సినిమాగా తీస్తే మంచి త్రిల్లర్ సినిమా అవుతుంది.  అలాంటి కంటతడి పెట్టించే  సంఘటన ఒకటి బెల్జియంలో జరిగింది.  కోరిన్ అనే మహిళా తన కారులో ప్రయాణిస్తుండగా.. అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయింది.  అలా కారు గుంటలో పడిపోవడంతో   కారు  అద్దాలు పగిలి ఆమె  వెన్నులో గుచ్చుకున్నాయి.  నడుము విరిగింది.  


కారులోనుంచి బయటకు రాలేని పరిస్థితి.  చెట్టు కొమ్మలు కారు అద్దాలు పగలగొట్టుకొని లోపలి వచ్చాయి.  నీళ్లు లేవు.  ఆహరం లేదు.  కదలలేని పరిస్థితి.  ఆకలి దాహం ఒకవైపు వెన్ను విరగడం...  నరకం చూసింది కోరిన్.  చెట్టు కొమ్మలను తింటూ.. తన దగ్గర ఉన్న చూయింగ్ గమ్ డబ్బాల్లో వర్షం కురిసినప్పుడు వచ్చిన నీళ్లను పట్టుకొని తాగుతూ ప్రాణాలు నిలుపుకుంది.  


ఎలాగైనా ప్రాణాలు నిలుపుకోవాలని పట్టుదలతో ప్రయత్నించింది.  ఒకవైపు ఆమె ఫోన్ రింగ్ అవుతున్నా ఆ ఫోన్ కారులో దూరంగా పడి ఉండటంతో కదలలేక  పోయింది.  కోరిన్ కనిపించకపోవడంతో ఆమె బంధువులు పోలీసులకు కంప్లైట్ చేశారు.  కోరిన్ ప్రయాణించిన కారు ఆధారంగా చేసుకొని పోలీసులు ఆయా ప్రాంతాలను గాలించారు.  అయితే, కోరిన్ కారు పడిన ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటంతో  ఆచూకీ  తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది.  


పోలీసులు ఆమె ఆచూకీ తెలుసుకున్నాక ఆమె కథ విని అంతా షాక్అయ్యారు.  ఆరు రోజులపాటు ఆమె పడిన బాధ గురించి విన్న ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన అంతాఇంతా కాదు.  ఆమెను చాలా  జాగ్రత్తగా  చూసుకుంటున్నారు.  ఎలాంటి  కష్టం  రాకుండా చూసుకున్నారు.  ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఆమె ప్రాణాలు కాపాడుకున్న వైనం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఆమె ఎవరు ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: