అవును మీరు చదివింది నిజంగా నిజమే. తుల బంగారం ధర అచ్చంగా రూ. 74,588 మాత్రమే. అయితే ఆ ధర ఇండియాలో కాదులేండి. పొరుగునే ఉన్న పాకిస్ధాన్ లో.  హఠాత్తుగా పాకిస్ధాన్ లో అన్నీ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో బంగాళదుంపల ధర 300 రూపాయలట. కిలో ఉల్లిపాయల ధర కూడా సుమారు 250 రూపాయలు పలుకుతోందట.

 

ఒక్కసారిగా పాకిస్ధాన్ లో నిత్యావసరాలతో పాటు బంగారం, వెండి లాంటి ఆభరణాల  ధరలు కూడా ఎందుకంత ఎత్తుకు ఎగిరిపోతోందో అర్ధం కావటం లేదు. బహుశా కేంద్రప్రభుత్వం జమ్మూ-కాశ్మీర్ విభజనకు తీసుకున్న నిర్ణయం కారణమేమో అన్నట్లుగా ఉంది పరిస్దితులు. జమ్మూ కాశ్మీర్ నుండి లఢక్ ను విడదీయటంతో ఒక్కసారిగా ఇండియా-పాకిస్ధాన్ సరిహద్దుల్లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు మొదలైపోయాయి.

 

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీని రద్దు చేయటంతో పాటు ఆ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. అంటే అసెంబ్లీ ఉంటుంది కానీ ఢిల్లీ లాంటి కేంద్రపాలిత ప్రాంతమన్నమాట. అంటే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి, ప్రభుత్వానికి పరిమితమైన అధికారాలు మాత్రమే ఉంటాయి. అలాగే లఢక్ ను విడదీసి 100 శాతం కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించేసింది. అంటే ఇక్కడ అసెంబ్లీ కూడా లేదు.

 

ఎప్పుడైతే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందో వెంటనే పాకిస్ధాన్ ప్రభుత్వం మండిపోయింది. పాకిస్ధాన్ లో ఆందోళనలు, అల్లర్లు ఆకాశాన్నంటాయి. బహుశా ఇటువంటి ఆందోళనల కారణంగానే నిత్యావసరాలతో పాటు అన్నీ ధరలు పెరిగిపోతున్నాయి.

 

అసలే పాకిస్దాన్ లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో  ఉన్నది  బలహీన ప్రభుత్వం. ఎప్పుడెపుడు ఇమ్రాన్ ఖాన్ ను ప్రధానమంత్రి పదవి నుండి దింపేద్దామా అని ప్రతిపక్షాలు రెడీగా అవకాశం కోసం కాచుకుని కూర్చున్నాయి. దానికితోడు ప్రభుత్వంలో అస్ధిరత, దేశంలో అదుపు తప్పిన శాంతి భద్రతలు. ఇంకేముంది నిత్యావసరాలతో పాటు అన్నీ ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. తాజాగా పెరిగిపోయిన బంగారం ధరలే ఇందుకు సాక్ష్యం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: