విమానాల్లో ప్రయాణం చేయాలనీ అందరు అనుకుంటారు.  కానీ, కొందరికి అలాంటి అవకాశం వస్తుంది.  వచ్చిన అవకాశాన్ని కొందరే ఉపయోగించుకుంటారు.  సెలెబ్రిటీలలో చాలా మందికి సొంత విమానాలు ఉంటాయి.  వాటిల్లోనే ప్రయాణం చేస్తుంటారు. మాములు విమానాల్లో సొంత జెట్ లో ప్రయాణం చేసినట్టుగా ఒంటరిగా ప్రయాణం చేసే అవకాశం వస్తుందా.. అంటే చాలా వరకు రాదని చెప్పాలి.  


ఒక్కరే ప్రయాణికులు అంటే.. ఆ ఫ్లైట్ టికెట్ ను క్యాన్సిల్ చేసి డబ్బు వాపస్ ఇచ్చేస్తారు.  లాస్ కు ఎవరు ఊరికే తీసుకెళ్లరు కదా.  కానీ, ఇక్కడ అలాకాదు.  ఓ వ్యక్తి కొలరాడో లోని అస్సెన్ నుంచి సాల్ట్ లేక్ సిటీ వెళ్ళాలి అనుకున్నాడు.  డెల్టా ఎయిర్ లైన్స్ లో టికెట్ కొనుగోలు చేశారు.  ప్రయాణ సమయం దగ్గరి వచ్చే సరికి ఆటను ఒక్కరే ఆ విమానంలో ప్రయాణం చేస్తున్నట్టు సిబ్బంది పేర్కొన్నాడు.  


మొదట ఆ వ్యక్తి షాక్ అయ్యాడు.  ఒక్కరే ప్రయాణం అనే సరికి థ్రిల్ అయ్యాడు. సిబ్బంది అతనొక్కడిని విమానం దగ్గరికి తీసుకెళ్లారు.  సాదర స్వగతం పలుకుతూ లఆహ్వానించారు.  ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు అతను దాన్నంతా వీడియోగా తీశాడు.  ఒక్కడే ప్రయాణికుడు కాబట్టి బరువు ఉండాలని విమానంలో కొన్ని ఇసుక బస్తాలు కూడా వేశారు. బరువుగా ఉంటేనే అది ప్రయాణం చేయగలుగుతుంది.  


ఇంతకీ ఇలా ఒంటరిగా ప్రయాణం చేసే అవకాశం వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా.. హాలీవుడ్ రచయిత, దర్శకుడు విన్సెన్ట్ పియోన్.   మొదటిసారి ఇలా ఒంటరిగా ప్రయాణం చేసే అవకాశం వచ్చిందట.  ఈ ప్రయాణం చాలా బాగుందని, ఎన్నో అనుభూతులు ఇచ్చిందని అంటున్నాడు పియోన్. పియోన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  అదృష్టం అంటే అదే మరి.  


తనకు ఇలా ఒంటరిగా ప్రయాణం చేయడం మొదటిసారే అయినప్పటికీ.. గతంలో డెల్టా విమానం ఒక్కరి కోసం సర్వీసులను నడిపిన రోజులు కూడా ఉన్నాయని సిబ్బంది చెప్పడం విశేషం.  ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు అన్నది తమ సిద్దాంతం అని సిబ్బంది చెప్పడం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి: