ఒక దేశం అభివృద్ధి చెందాలంటే దాని పొరుగు దేశాలు కూడా మంచివి అయి ఉండాలి. కానీ మన కర్మ ఏంటంటే మన పొరుగు దేశం పాకిస్తాన్ అయి ఉండటం. దేశం విడిపోయినప్పుడే తీవ్రవాద ఐడియాలజీ తో దేశంలో మారణ హోమం జరిపింది. మన దేశం నుంచి విడిపోయిన తరువాత కూడా కాశ్మీర్ ను ఆక్రమించుకోవటానికి ఉగ్ర మూకలను పంపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశం మీదకు ఉగ్ర మూకలను పంపిస్తూ భారత్ లో అలజడులు రేపుతోంది. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో .. ఇండియా ఎన్నో సాధించింది. ప్రపంచలోనే సూపర్ ఐటీ పవర్ గా నిలిచింది. సాంకేతిక విప్లవంలో ఎన్నో సాధించింది.


కానీ మన పక్కనే ఉన్న దాయాది దేశం ఏం సాధించింది. ఇన్నేళ్లలో ఉగ్రవాదులను తయారుచేయడం .. ఇండియా మీదకు పంపించడం. నిజానికిమనకు పాకిస్థాన్ లాంటి పొరుగు దేశం లేకుండా ఉండి ఉంటే.. భారత్ ఇంకా ఎంతో అభివృద్ధిని సాధించేది. ఉగ్రవాదుల నుంచి ఎన్నో ప్రాణాలు మిగిలేవి. అయితే ఇప్పడు భారత్ .. కాశ్మీర్ కు ఉన్న స్వయం ప్రతి పత్తిని తొలిగించడం తో భారత్ మీద విషం కక్కుతోంది. 


సాక్షాత్తు ఆ దేశ అధ్యక్షుడు మాట్లాడుతూ ఇండియా ను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా జీహాదీ ప్రకటించాలని విద్వేష పూరిత ప్రసంగాన్ని ఇచ్చారు. కాశ్మీర్ ను ఎప్పటికైనా తన భూభాగంలో కలిపేసుకోవాలని పాకిస్తాన్ కలలు కనింది. కానీ నరేంద్ర మోడీ పాకిస్థాన్ కు మాస్టర్ స్ట్రోక్ ఇస్తూ కాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక అధికారాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవటంతో పాకిస్తాన్ కు ఏం చేయాలో అర్ధం కావటం లేదు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు కూడా పాక్ కు మద్దతు ఇవ్వటం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: