శ్రీకాకుళం జిల్లా, వంగర మండలంలోని కోదులగుమడ మరియు రాజులగుమ్మడ గ్రామాల్లో పచ్చని పంట పొలాల చుట్టూ అరటి తోటలతో ఎంతో ఆహ్లాద వాతావరణం ఉంటుంది. ఇంత అందమైన ఈ ప్రదేశంలో ఒక అనుకొని ఆపదొచ్చిపడింది. ఇక్కడ విజయనగరం జిల్లా నుంచి వచ్చిన ఏనుగుల మంద ఒక్క సారిగా ఊళ్లపైపడి అరటి చెరకు మొక్క జొన్న వరి పంటలను నాశనం చేశాయి.  

సినిమాలో మరియు టీవీలో చూడడం, వినడం తప్ప ఏనుగుల ముఖం చూడని స్థానికులు భయభ్రాంతుల్లో బతుకుతున్నారు.ఏనుగులను తరిమేందుకు గ్రామస్థులు ఎంతగానో ప్రయత్నించారు కానీ వారి శ్రమ వృథా అయింది. జనంపైకి గజరాజులు తిరగబడ్డాయి, కనిపించిన వారిని వెంటాడాయి. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు పెట్టారు. ఈ క్రమంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

గ్రామస్తుల పంట పొలాలను ఎనుగులు నాశనం చేస్తున్నాయి. పొలం వెళ్లాలంటేనే భయమేస్తోందని ఏనుగులను తరమికొట్టాలనే రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.గ్రామా ప్రజలు మాట్లాడుతూ ఏనుగుల గుంపు పంట పొల్లాలో పడి పంటలను నాశనం చేస్తున్నాయి అలాగే జొన్న, చెరుకు అరటి  మరియు కూరగాయల పొలాలను నాశనం చేస్తున్నాయి అని వాపోయారు.  ఏదో ఒక విధంగా ప్రభుత్వం వారు చర్యతీసుకోని తక్షణమే ఏనుగుల గుంపులను తరిమేయాలి అని ఆందోళనలు చెప్పట్టారు.

ఊళ్ళో కరెంట్ సరిగా లేదు మరియు తాగడానికి నీళ్లేవు అని ప్రజలు వాపోయారు. ఇలాంటి సమయంలో ఇలా ఏనుగులు పంట పొలాలను నాశనం చేయడం ద్వారా తమకు ఇంకా ఇబ్బంది చేకూరుతుంది అని స్థానికులు చెప్తున్నారు.శ్రీకాకుళం మన్యం మైదాన ప్రాంతాలు ఏనుగుల గుంపులకు అడ్డాగా మారుతున్నాయి. ఒడిశా నుంచి వస్తున్న ఏనుగులు చుట్టు పక్కల గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు వరుస బెట్టి దాడులకు తెగబడిన ఏనుగులు క్రమక్రమంగా తగ్గిపోయాయి. మొత్తం పదకొండు ఎన్నికల్లో నాలుగు మాత్రమే బతుకు ఉన్నాయి.

ఇవి మాత్రమే అడపా దడపా దాడులకు పాల్పడుతున్నాయి.వీటితోనే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇపుడు విజయనగరం జిల్లా అటవీ ప్రాంతం నుంచి మరో ఆరు ఏనుగులొచ్చాయి. కనిపించిన వారిని తొక్కేందుకు ప్రయత్నిస్తున్నయి పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. ప్రభుత్వం వారు వెంటనే జోక్యం చేసుకొని ఇంటిని తరిలించాల్సిందిగా చుట్టూ ప్రక్క ప్రాంతాల వారు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: