ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  నియమించడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది  ఎవరికీ అంతుచిక్కడం లేదు. గతం లో  వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లో  ఇదే యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ హిందీ భాషా సంఘం అధ్యక్షులుగా నియమించారు.  అయితే ఇప్పుడు జగన్ మాత్రం ఆయన్ని  అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమించడం సర్వత్రా హాట్ టాఫిక్ గా మారింది . హిందీ పండిట్ అయిన యార్లగడ్డ  లక్ష్మీ ప్రసాద్ ను  అధికార భాషా సంఘం అధ్యక్షుడు గా నియమించడం ఏమిటని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


అధికార భాష సంఘం అధ్యక్షుడిగా నియమించడానికి తెలుగు పండితులు ఎవరు దొరకలేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు .  యార్లగడ్డ  లక్ష్మీ ప్రసాద్ కు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఇవ్వడం వల్ల ఒక సామాజిక వర్గానికి తమవైపు తిప్పుకోవచ్చుననే  భావనతోనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని తీసుకుని ఉంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది .  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పూర్తిస్థాయిలో రాజకీయంగా విభేదించిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ , అదే  పార్టీకి చెందిన పలువురు తన  సొంత, చంద్రబాబు సామాజికవర్గ నేతలు మాత్రం కలిసి రాసుకుపూసుకు తిరిగే వారనేది నిర్వివాదాంశమేనని అంటున్నారు . టీడీపీ అధికారం లో ఉన్నప్పుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి వంటి వారితో సన్నిహిత సంబంధాలను కొనసాగించారని పలువురు గుర్తు చేస్తున్నారు .


  అటువంటి వ్యక్తిని అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమించడం వల్ల  పార్టీకి ఏ విధంగా మేలు జరుగుతుందన్న చర్చ వైకాపా వర్గాల్లో కొనసాగుతోంది .  అయితే సొంత సామాజిక వర్గ నేతల్లో మంచి పలుకుబడి కలిగిన యార్లగడ్డ కు అధికార భాష సంఘం అధ్యక్ష పదవి కట్టబెట్టడం వల్ల , తాము ఒకే వర్గానికి ప్రాధాన్యతను ఇవ్వకుండా అన్ని వర్గాలవారిని సమానంగా చూస్తున్నామని సంకేతాలను ప్రజలకు పంపవచ్చునని వైకాపా నాయకత్వం భావిస్తోన్నట్లు తెలుస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: