రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణం. కానీ ఒక్కోసారి ఆ విమర్శలు శృతిమించుతాయి.  ప్రస్తుతం ఏపీ  రాజకీయాలు విమర్శలతోనే రసవత్తరంగా మారుతున్నాయి.   ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం ఏర్పడ్దాకా కూడా పాలన పై దృష్టి సారించకుండా.. కక్ష్య సాధింపు చర్యలు చేపడుతుందని టీడీపీ పార్టీ.. లేదూ గత ప్రభుత్వం చేసిన ప్రతి పని అవినీతిమయమే  అని వైసీపీ పార్టీ  ఒకరి పై ఒకరు దుమ్మెతిపోసుకుంటున్నాయి. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ  గత ఐదేళ్ళు  దోచుకు తిన్నారని,  ప్రస్తుతం  అధికారంలోకి వచ్చిన  వైసీపీ ప్రధానంగా ఆరోపణలు చేస్తుంది.  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను  అమలు చేయకుండా  జగన్ ప్రభుత్వం  జాప్యం చేస్తుందని టీడీపీ మొత్తుకుంటుంది.  నిజానికి  ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి 70 రోజులు గడిచినా సీఎం జగన్ చెబుతున్న హామీలు ఇంకా పూర్తి స్థాయిలో పట్టాలెక్కడంలేదనే అనుకోవాలి.  


పైగా  రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం గురుంచి ఆలోచించాల్సిన వైసీపీ నేతలు  టీడీపీ నేతల పై  వ్యక్తిగత విమర్శలు చేస్తూ కాలయాపన  చేస్తున్నారు. మొత్తానికి  వైసీపీ నేతల చేతగాని తనాన్ని టీడీపీ నేతలు బాగానే ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం.  ముఖ్యంగా  గత కొద్ది రోజులుగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న సోషల్ మీడియా ద్వారా వైసీపీ ప్రభుత్వం పై సంచలన ఆరొపణాలు చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే.  అయితే తాజాగా బుద్ధా వెంకన్న వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి పై తనదైన శైలిలో విరుచుకుపడ్దారు. జగన్ గారి అమెరికా పర్యటనకు దొంగ లెక్కల మాస్టారు ఎందుకు డుమ్మా కొట్టినట్టు ? ప్రతి పర్యటనలో ఉండే తోకనేత అమెరికా పర్యటనకు ఎందుకు వెళ్లలేదు.  విదేశాలకు వెళ్తే నిమ్మగడ్డ ప్రసాద్ లా నిన్ను కూడా జైల్లో వేస్తారు అని భయమా వీసా రెడ్డి గారూ అని ప్రశ్నించారు.  అన్నట్టు జైల్లో వేస్తే,  ప్రజలకు సేవ చేస్తుంటే జైల్లో వేసారు అని రాయడానికి అక్కడ దొంగ పేపర్, దొంగ ఛానెల్ లేవుగా అని కూడా  బుద్ధా వెంకన్న చమత్కరించారు.  


ఏమైనా  విజయసాయి రెడ్డి  ఎప్పుడు ట్విటర్ వేదికగా  చంద్రబాబు పై అలాగే టీడీపీ నాయకుల పై నిప్పులు చెరుగుతూ ఉంటారు. ఇప్పుడు బుద్ధా వెంకన్న   విజయసాయి రెడ్డి పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. మరి ఈ విమర్శల పై  విజయసాయి రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.     

 


మరింత సమాచారం తెలుసుకోండి: