బుద్దా వెంకన్న  నేడు ఒక ప్రెస్ మీట్ లో    ఈ ప్రభుత్వ పాలన పై మాకు నమ్మకం‌ లేదని అసలు ప్రభుత్వ పాలన ఉండా అని ప్రశ్నిస్తూ నిప్పులు చెరిగారు.   టిడిపి అధినేత మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు ను హతమార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్ధతిగా కుట్రలూ కుతంత్రాలూ చేస్తుందని  ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఈ కుట్రలను ఆపకపోతే ప్రభుత్వ  కుతంత్రాల గురించి అందరికీ తెలిసేలా ముఖ్యమంత్రి జగన్ ఇంటి ముందే తాను ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించారు. 


తమ అధినేత ను కాపాడుకునేందుకు తాను చావడానికైనా సిద్ధమేనని చెప్పారు. ఆదివారం విజయవాడ లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు వైసిపి అధికారంలోకి వచ్చినవెంటనే జడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ లో ఉన్న చంద్రబాబుకు భద్రత తగ్గించారని విమర్శించారు, భద్రత పెంచాలని హై కోర్టు ఆదేశించినా పట్టించుకోలేదు అని బుద్దా ప్రభుత్వ తీరు పై తీవ్రంగా మండిపడ్డారు. 


కృష్ణా వరదల వల్ల ముంపు గురైన  ఎన్నో పాంతాలున్నా వాటిని  పట్టించుకోకుండా వదిలేసి కరకట్ట ప్రాంతం లో చంద్రబాబు నివాసమున్న ఇంటి పరసరాల దగ్గర లో మాత్రమే డ్రోన్ ల సాయంతో రెక్కి నిర్వహించడం,  స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తో సహా ముగ్గురు రాష్ట్ర మంత్రులు మాటిమాటికి చంద్రబాబు ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించినట్లుగా పరిశీలన చేయడం వెనుక ఆంతర్యాన్ని గమనిస్తే  చంద్రబాబు ను టార్గెట్ చేశారనే విషయం బాగా అర్థమవుతుందన్నారు. చంద్రబాబు ఇదే విధంగా టార్గెట్ చేసి ఉంటే రాష్ట్రం లో ఇతర పార్టీలేవీ ఉండేవి కావన్నారు.


చంద్రబాబు ముక్యమంత్రి గా ఉన్నప్పుడు  ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ గతంలో పాద యాత్ర చేసినప్పుడు ప్రతి పక్ష నేత గా ఆయన తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా చంద్రబాబు పూర్తి రక్షణ కల్పించారని చెప్పారు. హై సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు ఇంటిని డ్రోన్ లతో చిత్రీకరించేందుకు ఎవరు అనుమతి ఇచ్చారని మేము ప్రశ్నిస్తే వరద పరిస్థితి ని తెలుసుకునేందుకే డ్రోన్ లతో చిత్రీకరించామని ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చిందంటూ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తప్పుడు ప్రకటన చేశారు అని చెప్పారు. ఏ రోజు ఎన్ని గంటల కు పర్మిషన్ ఇచ్చారో కంప్యూటర్ లో టైమింగ్ తో సహా నమోదై ఉంటుంది కదా, ఒకవేళ అలా పర్మిషన్ ఇచ్చి ఉంటే ఆ వివరాలను చూపించమని బుద్దా డిమాండ్ చేశారు.


చంద్రబాబు కు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతపై తమకు నమ్మకం లేదని అందుకే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తమ నాయకుడికి తగిన రక్షణ కల్పించి కాపాడాలని కోరుతూ ప్రధాని మోదీ కి హోం మంత్రి అమిత్ షాలకు తాను లేఖ రాస్తానని ఆయన చెప్పారు. వరదల వల్ల కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలు ముంపు ప్రాంతాల్లో అష్టకష్టాలు పడుతుంటే ముఖ్యమంత్రి జగన్ అమెరికా వెళ్లి విందులు వినోదాలతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆయన విమర్శించారు. ఇక్కడ రాష్ట్ర మంత్రులేమో వరద బాధితులను గాలికొదిలేసి చంద్రబాబు ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని బుద్ధా విమర్శించారు. ఈ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉంటే ప్రపంచం లో ఎక్కడ ఉన్నా హుటాహుటిన వచ్చి వరద బాధితులకు అండగా నిలబడే వారని తెలిపారు. అంతే కానీ‌ అక్కడా ఇక్కడా తిరిగే వారు కారని ఘాటుగా చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: